Fire accident at Kaleswaram Polling Booth in Telangana Elections 2023:తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఈ మూడు పార్టీలు గెలిచి అధికారంలోకి వచ్చేది మేమే అంటే మేమే అంటూ ధైర్యంగా ఉన్నాయి. ఇక సమస్యాత్మక నియోజకవర్గాలుగా 106 నియోజకవర్గాలను గుర్తించినా ఎలాంటి ఇబ్బందికర అంశాలు లేకుండానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పోలింగ్ బూత్ లకు వెళ్లెందుకు ఓటర్లకు తిప్పలు తప్పడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన 168,169 పోలింగ్ కేంద్రాల ముందు గల భారీ వృక్షానికి మంటలు చెలరేగడంతో ఓటర్లు ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదం ముందస్తుగా ప్రమాదం జరగకుండా కాళేశ్వరం పోలీసులు స్పందించి నీటితో చల్లార్చే ప్రయత్నం చేశారు అయితే అంత చేసినా పొగ అదుపులోకి రాలేదు.
Telangana Elections 2023: పోలింగ్ పర్సెంటేజ్ తగ్గితే ప్రధాన కారణం ఫోనే.. ఎందుకో తెలుసా?
దీంతో అధికారులు 2 ఫైర్ ఇంజన్లను రప్పించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రదేశం నుంచి ఓటింగ్ వేసేందుకు కొంతమేర ఓటర్లు ఇబ్బంది పడుతున్న క్రమంలో పోలీసులు, అధికారులు భారీ వృక్షం కొమ్మలు నరికి వేసి అవి రోడ్డుపై పడడంతో ఆ చెట్ల కొమ్మల మధ్య నుంచి నడుచుకుంటు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక మరోపక్క నిర్మల్ జిల్లాలో ఓటు వేసేందుకు ఆవుపై వచ్చిన వ్యక్తి వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. తానూరు మండలం మహలిoగి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం వేరే చోట నివాసం ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తన స్వంత గ్రామానికి ఆవు పై రావడం హాట్ టాపిక్ అయింది. ఆవు మీద వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్న అంటూ వీడియో రిలీజ్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో చక్కర్లు కొడుతున్నది.