నందమూరి నట సింహ బాలకృష్ణ, అనీల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ క్రేజీ కాంబినేషన్ దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న థియేటర్స్ లోకి రానున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతున్నారు. అక్టోబర్ 8న వరంగల్ లో భగవంత్ కేసరి గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయనున్నారు. ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో వేగం పెరగనుంది. అక్టోబర్ 18 వరకూ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేయడానికి అనిల్ రావిపూడి రెడీగా ఉన్నాడు. కామెడీ టచ్ ఉంటూనే బాలయ్య మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండే భగవంత్ కేసరి సినిమా టీజర్ తోనే హైప్ పెంచారు మేకర్స్. ఇప్పుడు ట్రైలర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని మరింత పెంచడం గ్యారెంటీ.
బాలయ్య భగవంత్ కేసరి సినిమాకి రవితేజ టైగర్ నాగేశ్వర రావు నుంచి విజయ్ లియో సినిమా నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ రెండు చాలవన్నట్లు బాలయ్యకి పోటీగా ఎన్టీఆర్ వస్తున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన అదుర్స్ సినిమా అక్టోబర్ 19న రీరిలీజ్ కి రెడీ అవుతోంది. సూపర్ హిట్ అయిన ఈ సినిమాని రీరిలీజ్ చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చిందో? దసరా రోజునే ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ సోషల్ మీడియాలో అదుర్స్ రీరిలీజ్ టాక్ బాగానే వినిపిస్తుంది. ఆలోచన బాగానే ఉంది కానీ పెద్ద సినిమాలు లేని సమయంలో రీరిలీజ్ పెట్టుకోని ఉంటే అదుర్స్ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చేవి. భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో అదుర్స్ సినిమాకి వెళ్లే నందమూరి అభిమానులు ఉండకపోవచ్చు. సో ఇది క్లాష్ కాదు క్యాజువల్ న్యూస్ గా మాత్రమే చూడాలి.