Asus Gaming Laptops Released in India: ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ‘అసుస్’ తన కొత్త ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. గేమింగ్ ల్యాప్‌టాప్ అసుస్ ఆర్‌ఓజీ జెఫిరస్ జీ16 కొత్త వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇది కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్. ఈ ల్యాప్‌టాప్ 16 అంగుళాల 2.5కే రిజల్యూషన్, ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్, 90 డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీతో వచ్చింది. ఆర్‌ఓజీ స్ట్రిక్స్ స్కార్ 16, ఆర్‌ఓజీ స్ట్రిక్స్ స్కార్ 18 ల్యాప్‌టాప్‌లను 13వ తరం ఇంటెల్ కోర్ ఐ9 సిరీస్ ప్రాసెసర్లు, ఎన్విడియా ఆర్‌టీఎక్స్ 4000 సిరీస్ జీపీయూలతో అప్‌గ్రేడ్ చేశారు.
Asus ROG Zephyrus G16 Price in India:
అసుస్ ఆర్‌ఓజీ జెఫైరస్ జీ16 ల్యాప్‌టాప్ ధరను కంపెనీ రూ.1,89,990గా నిర్ణయించింది. ఆర్‌ఓజీ స్ట్రిక్స్ స్కార్ 16 ప్రారంభ ధర రూ.2,89,990 కాగా.. ఆర్‌ఓజీ స్ట్రిక్స్ స్కార్ 18 ప్రారంభ ధర రూ.3,39,990గా ఉంది. అసుస్ ఆర్‌ఓజీ జీ22 డెస్క్‌టాప్ ధర రూ.2,29,990గా ఉంది. అసుస్ ఈ-స్టోర్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో వీటి సేల్ ప్రారంభం కానుంది. అసుస్ ఆర్‌ఓజీ స్ట్రిక్స్ స్కార్ 16, స్కార్ 18, జెఫైరస్ జీ16 ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే మొదటి 50 మంది కస్టమర్లకు రూ.1కే టీయూఎఫ్ హెచ్3 హెడ్ సెట్‌ను ఉచితంగా కంపెనీ అందించనుంది.
Asus ROG Zephyrus G16 Features:
ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 ప్రో ఓఎస్‌తో వస్తోంది. 2.5కే (1,600×2,560 పిక్సెల్స్) రిజల్యూషన్, 240Hz రిఫ్రెష్ రేటుతో కూడిన WQXGA డిస్‌ప్లే ఉంటుంది. ఎన్విడియాకు చెందిన ఆర్‌టీఎక్స్ 4090 జీపీయూతో అనుసంధానించిన ఏఐ ఆధారిత ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. గేమింగ్ ఫీచర్ల సామర్థ్యాన్ని విస్తరించేలా జీపీయూను ఎంయూఎక్స్ స్విచ్‌ను ఇచ్చారు. వేడిని నియంత్రించేలా రెండోతరం ఆర్క్ ఫ్లో ఫ్యాన్లు, కొత్తగా రూపొందించిన ఎయిర్‌ఔట్‌లెట్లను ఇచ్చారు. బ్యాటరీ కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది.
Also Read: Sarfaraz Khan: అరుదైన రికార్డు నెలకొల్పిన సర్ఫరాజ్ ఖాన్.. సచిన్ టెండూల్కర్ తర్వాత..!
Asus ROG Strix Scar 16 and 18 Sepcs:
ఆసుస్ ఆర్‌ఓజీ స్ట్రిక్స్ స్కార్ 16, స్ట్రిక్స్ స్కార్ 18 ల్యాప్‌టాప్‌లతో పాటు ఆర్‌ఓజీ జీ55 గేమింగ్ డెస్క్‌టాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది. స్ట్రిక్స్ స్కార్ 16లో 240 రీఫ్రెష్ రేటుతో కూడిన 16 అంగుళాలు, స్కార్ 18లో 18 అంగుళాల డిస్‌ప్లేను అమర్చారు. వీటిని సరికొత్త కోర్ ఐ9 14900HX ప్రాసెసర్‌తో అప్‌డేట్ చేశారు. స్కార్ 16లో 175W గరిష్ఠ గ్రాఫిక్స్ పవర్ ఉన్న ఎన్విడియా GeForce RTX 4090, స్కార్ 18లో GeForce RTX 4080 జీపీయూను ఇచ్చారు. రెండింట్లో ఎంయూఎక్స్ స్విచ్, 64జీబీ ర్యామ్, 4టీబీ వరకు స్టోరేజ్ ఇచ్చారు.
Asus ROG G22 Desktop:
ఆసుస్ ఆర్‌ఓజీ జీ22 డెస్క్‌టాప్‌ను ఇంటెల్ కోర్ ఐ7-14700ఎఫ్ ప్రాసెసర్‌తో అప్‌గ్రేడ్ చేశారు. దీనికి ఎన్విడియా GeForce RTX 4070 జీపీయూను అనుసంధానించారు. ఇందులో 32 జీబీ డీడీఆర్5 ర్యామ్‌ను ఇచ్చారు. ఫ్రంట్ ప్యానెల్‌పై RGB లైటింగ్, డాల్బీ అట్మోస్, ఏఐ నాయిస్ క్యాన్సిలింగ్ టెక్నాలజీతో కూడిన స్పీకర్లు ఉన్నాయి.