Sarfaraz Khan: అరుదైన రికార్డు నెలకొల్పిన సర్ఫరాజ్ ఖాన్.. సచిన్ టెండూల్కర్ తర్వాత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarfaraz Khan surpasses Shubman Gill: దేశవాళీ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తుది జట్టులో సర్ఫరాజ్ చోటు దక్కించుకున్నాడు. టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదగా అతడు టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు. దాంతో సర్ఫరాజ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున అరంగేట్రం చేసే సమయానికి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక బ్యాటింగ్ సగటు ఉన్న ఆరో భారత బ్యాటర్‌గా నిలిచాడు.
భారత్ తరఫున అరంగేట్రం చేసే సమయానికి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వినోద్ కాంబ్లీ అత్యధిక బ్యాటింగ్ సగటును కలిగి ఉన్నాడు. కాంబ్లీ జాతీయ జట్టులోకి అడుగుపెట్టే ముందు 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 88.37 సగటుతో పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 45 మ్యాచ్‌ల్లో 69.85 సగటుతో రన్స్ చేశాడు. ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్‌ను అధిగమించి.. సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 45 మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్.. 3,912 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 11 అర్ధ శతకాలు ఉన్నాయి.
Also Read
- Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
- CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
- Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ ఇంకా బ్యాటింగ్‌కు రాలేదు. సర్ఫరాజ్ అయిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంది. 33 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒత్తిడిలో సర్ఫరాజ్‌ను బ్యాటింగ్‌కు పంపొద్దని భావించిన టీమ్ మేనేజ్మెంట్.. రవీంద్ర జడేజాను ఆ స్థానంలో దించింది. ఇది భారత జట్టుకు కలిసొచ్చింది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కలిసి ఇప్పటివరకు 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
Also Read: IND vs ENG Test: లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 93/3! ఇంగ్లండ్‌దే మొదటి సెషన్
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక బ్యాటింగ్ సగటు ఉన్న బ్యాటర్లు:
వినోద్ కాంబ్లీ – 88.37 (27 మ్యాచ్‌లు)
ప్రవీణ్ ఆమ్రే – 81.23 (23 మ్యాచ్‌లు)
యశస్వి జైస్వాల్ – 80.21 (15 మ్యాచ్‌లు)
రుషి మోదీ – 71.28 (38 మ్యాచ్‌లు)
సచిన్ టెండుల్కర్ – 70.18 (9 మ్యాచ్‌లు)
సర్ఫరాజ్ ఖాన్ – 69.85 (45 మ్యాచ్‌లు)
శుబ్‌మన్ గిల్ – 68.78 (23 మ్యాచ్‌లు)
తాజావార్తలు
-
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
-
WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్‌లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..