ఆస్ట్రోనోమర్ సీఈఓ ఆండీ బైర్న్ తన హెచ్ ఆర్ హెడ్ క్రిస్టిన్ కాబోట్‌తో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వారిద్దరూ ఒకరికొకరు క్లోజ్ గా కనిపిస్తున్నారు. ఈ వీడియో బోస్టన్‌లోని జిల్లెట్ స్టేడియంలో కోల్డ్‌ప్లే ఇటీవల నిర్వహించిన కచేరీకి సంబంధించినదని చెబుతున్నారు. బుధవారం రాత్రి కోల్డ్‌ప్లే కచేరీలో, కిస్ క్యామ్ ప్రేక్షకులలో ఉన్న జంటలపై దృష్టి సారించినప్పుడు, కెమెరా ఆండీ బైరాన్, క్రిస్టిన్ కాబోట్‌పై ఆగిపోయింది. వీడియోలో, ప్రియురాలిని హగ్ చేసుకుని ఉన్నట్లుగా కనిపించింది. స్క్రీన్ పై కనిపిస్తున్నామని గ్రహించిన వెంటనే బైరన్ ప్రియురాలిని విడిచి టేబుల్ కింద దాక్కోవడానికి ప్రయత్నించాడు. కాబోట్ తన చేతులతో ముఖం కనిపించకుండా కవర్ చేసుకుంది. దీన్ని అర్థం చేసుకున్న గాయకుడు క్రిస్ మార్టిన్, ‘ఓహ్… ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారా లేదా వారు చాలా సిగ్గుపడుతున్నారా’ అని అన్నాడు.
Also Read:Trump: పాకిస్థాన్‌లో ట్రంప్ పర్యటన వార్తలపై స్పందించిన వైట్‌హౌస్
బైరాన్, అతని హెచ్ఆర్ చీఫ్ కు చెందిన ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఎందుకంటే బైరాన్ కి ఇదివరకే వివాహం అయ్యింది. ఈ వీడియో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే ఊహాగానాలకు దారితీసింది. నెటిజన్స్ స్పందిస్తూ.. ‘అతని భార్య పట్ల బాధగా ఉంది, కానీ అతడు గుట్టుగా సాగిస్తున్న ప్రేమాయణం బహిర్గతం కావడం, ఇబ్బంది పడటం సంతోషంగా ఉంది.’ అని కామెంట్ చేశాడు.
Also Read:PM Modi: నేడు బీహార్, బెంగాల్‌లో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం
ఆండీ బైర్న్ ఎవరు?
ఆండీ బైర్న్ జూలై 2023 నుంచి $1.3 బిలియన్లకు పైగా విలువైన డేటా/సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన ఆస్ట్రోనోమర్‌కు CEOగా ఉన్నారు. అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అతను గతంలో ఫ్యూజ్/థింకింగ్‌ఫోన్స్ వంటి కంపెనీలలో కీలక పాత్రలు పోషించాడు. ఆండీ బైరాన్ మేగాన్ కెర్రిగన్ బైరాన్‌ను వివాహం చేసుకున్నారు. వారు తమ ఇద్దరు పిల్లలతో న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత మేగాన్ తన ప్రొఫైల్ నుంచి బైరాన్ ఇంటిపేరును తొలగించారని పేర్కొన్నారు. ఇది వారి వైవాహిక జీవితంలో ఉద్రిక్తత గురించి ఊహాగానాలకు దారితీసింది. అయితే, ఈ విషయంపై మేగాన్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Busted!
This backfired real quick.
CEO and HR having an affair and were outed during Coldplay‘s concert 👀
Andy Byron and Kristin Cabot from Astronomer 😬😬😬
Wife‘s Facebook has already been found and people commenting on it. pic.twitter.com/RWgYDVMuaV
— Mrs. SpaceX ™️ (@anuibi) July 17, 2025