తన వ్యక్తిగత జీవితంపై అసంతృప్తితో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూలీగా మారాడు. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు ఏప్రిల్ 7న తాను ఉంటున్న కాలేజీ హాస్టల్ నుంచి అదృశ్యమయ్యాడు. దీంతో.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో గల స్వగ్రామానికి పోయి ఉండవచ్చని కళాశాల అధికారులు భావించారు. అయితే అతడు అక్కడికి రాలేదని కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. కొన్ని రోజులు అతడి కోసం వెతికారు. అయితే.. ఎంతకీ అతడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడని, ఆ తర్వాత మార్కెట్‌లో కూలీగా పని చేస్తున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
Also Read : Sai Dharam Tej: మెగా మేనల్లుడు లుంగీ వెనుక ఉన్న రహస్యం ఇదా..?
దీంతో.. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని స్థానిక పండ్ల మార్కెట్‌లో అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్ మరియు ఆయన బృందం నిఘా ఉంచింది. నిన్న తెల్లవారుజామున సదరు యువకుడు కూలీ పని చేసేందుకు అక్కడికి రావడాన్ని పోలీసులు గమనించారు. అతడిని అదుపులోకి తీసుకుని కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు. అయితే.. సదరు వ్యక్తి ఇలా ఎందుకు ప్రవర్తించాడనే దానిపై క్లారిటీ లేదు.