Asian Games 2023 India vs Bangladesh Semi Final 1: ఓ వైపు వన్డే ప్రపంచకప్ 2023.. మరోవైపు 2023 ఆసియా గేమ్స్ జరుగుతున్నాయి. సీనియర్ టీమ్ ప్రపంచకప్ లక్ష్యంగా బరిలోకి దిగుతుంటే.. జూనియర్లు గోల్డ్ మెడల్ లక్ష్యంగా దూసుకెళుతున్నారు. భారత మహిళల జట్టు ఇప్పటికే స్వర్ణం నెగ్గగా.. పురుషుల టీమ్ కూడా గోల్డ్ మెడల్‌పై కన్నేసింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌లో అద్భుత విజయం సాధించిన భారత్.. సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడుతోంది. పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ వేదికగా జరుగుతున్న సెమీస్ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
బంగ్లాదేశ్‌తో సెమీస్‌లో భారత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో షహబాజ్ అహ్మద్ అరంగేట్రం చేశాడు. అవేష్ ఖాన్ స్థానంలో షహబాజ్ జట్టులోకి వచ్చాడు. అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే ఫ్రంట్‌లైన్ పేసర్‌గా ఉన్నాడు. శివమ్ దూబె, సాయి కిశోర్ అతడికి అండగా నిలవనున్నారు. ఇక బంగ్లాపై విజయం సాధిస్తే భారత్ ఫైనల్ చేరుతుంది. దాంతో గోల్డ్ మెడల్ గెలిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బంగ్లా 8 ఓవర్లకు 3 వికెట్స్ కోల్పోయి 35 రన్స్ చేసింది.
Also Read: Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులంపై ఎంతంటే?
తుది జట్లు:
భారత్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబె, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, షహబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్, అర్ష్‌దీప్ సింగ్.
బంగ్లాదేశ్: పర్వేజ్ హోసేన్ ఎమోన్, మహముదుల్ హసన్ జాయ్, జకీర్ హసన్, సైఫ్ హసన్ (కెప్టెన్), అఫిఫ్ హోసెన్, షాహదాత్, జాకెర్ అలీ (వికెట్ కీపర్), రకీబుల్ హసన్, హసన్ మురద్, మృతున్జయ్ చౌదురీ, రిపన్ మోండల్