భారతదేశం పాకిస్థాన్ పై వైమానిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు. దీనికి ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ దాడి ఘటనపై తాజాగా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఒవైసీ పాకిస్థాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు. ఓ వేదికపై నిల్చున్న అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Indo-Pak: “అసలు సినిమా ముందుంది” భారత ఆర్మీ మాజీ చీఫ్ సంచలన పోస్ట్
కాగా.. జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ గతంలో స్పందించారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అమాయకులైన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. సైనిక దుస్తులు ధరించి వచ్చి అమాయక ప్రజల ప్రాణాలు తీయడం హేయమైన చర్య అని అన్నారు. పర్యాటకులపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ దుశ్చర్యకు బాధ్యులైన వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఉగ్రదాడిపై ఒవైసీ ముందు నుంచి కేంద్ర ప్రభుత్వా్నికి సపోర్టుగా నిలిచారు.
READ MORE: Pakistan: భారత్‌పై యుద్ధానికి పాక్ ప్లాన్.. గగనతలం మూసివేత, స్కూళ్లకు సెలవులు..
पाकिस्तान मुर्दाबाद#OperationSindoorpic.twitter.com/bgfQm4LeGd
— Asaduddin Owaisi (@asadowaisi) May 7, 2025