ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తు రికార్డులు బ్రేక్ చేస్తున్న సందర్భంగా చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం అంతా ఈ ప్రెస్ మీట్ కు హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత నవీన్ గారు మాట్లాడుతూ “అందరికీ నమస్కారం. సినిమా రిలీజ్ అయిన తరువాత పని ఎక్కువ అయిపోయింది. అందరి దగ్గరా నుండి మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి. ఇదే ఈ చిత్ర విజయానికి నిదర్శనం. ఈ సినిమా ఎంతగా ఆదరించిన తెలుగు ప్రజలందరికీ థాంక్స్. ఫాస్టెస్ట్ 500 కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. మరింత విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడం భారతతీయులందరికీ గర్వకారణం” అన్నారు.
Also Read : Puhspa 2 : ఓవర్సీస్ లో రికార్డుల రప్ప రప్పా చేస్తున్న పుష్ప రాజ్
నిర్మాత రవి మాట్లాడుతూ “అందరికి నమస్కారం. సినిమా ప్రీమియర్ షో చూడగానే ఇద్దరు సినిమా మాడ్నెస్ ఉన్నవాళ్ళు సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూస్తారు. రెండు రోజులకు 500 కోట్లకు పైగా సినిమా కలెక్ట్ చేసినందుకు ఆనందంగా ఉంది . అలాగే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి పేరుపేరునా మా ధన్యవాదాలు. మా సినిమా టికెట్ ధర రూ. 800 అని అనుకున్నారు, కానీ అది ప్రీమియర్స్ కు మాత్రమే, ఇక నుండి థియేటర్లో టికెట్ రేట్ అందరికి అందుబాటులో ఉంటుంది. అందరూ కచ్చితంగా చూడాల్సిందిగా కోరుతున్నాము” అని అన్నారు.