Aruna Millar: అగ్రరాజ్యంలో మరోసారి భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. అరుణ మేరీలాండ్ రాష్ట్రానికి 10వ లెఫ్టినెంట్ గవర్నర్. ఈ క్రమంలోనే ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి ఇండియన్-అమెరికన్ వ్యక్తిగా అరుణ రికార్డు సృష్టించారు. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెదపారుపూడి కాగా వారి కుటుంబం చాలా ఏళ్ల క్రితం అమెరికా వలస వెళ్లింది.
Read Also: Driving Skills: వీడి డ్రైవింగ్ వేరే లెవల్.. నిపుణుల పర్యవేక్షణలోనే ఇలాంటివి చేయాలి
అరుణ తన కెరీర్‌ను ట్రాన్స్ పోర్ట్ ఇంజినీర్‌గా ప్రారంభించారు. ఆమె తండ్రి కాట్రగడ్డ వెంకట రామారావు ఐబీఎం సంస్థలో పని చేసేవారు. 1972లో వీరి కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడింది. 2010 నుంచి 2018 వరకు మేరీలాండ్ హౌజ్ ఆఫ్ డెలిగేట్స్‌లో రెండు పర్యాయాలు అరుణ సభ్యురాలిగా ఉన్నారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అరుణ ఈ పదవి చేపట్టడం పట్ల పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో బంధువులు, గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు.
Read Also: Uorfi Javed: నిజాన్ని ఒప్పుకున్న ఉర్ఫీ జావేద్.. పాపులారిటీ కోసమే ఇదంతా