Uorfi Javed: నటి ఉర్ఫీ జావేద్.. ఈ పేరు సామాజిక మాధ్యమాల్లో చాలా పాపులర్. సెమీ న్యూడ్ వస్త్రాలతో బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ తో ఫేమస్ అయిన ఈ బొమ్మ తరచూ తన వివాదాల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవలె బహిరంగ ప్రదేశాల్లో అశ్లీలంగా, అసభ్యతను ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలపై ఉర్పీ జావెద్‌పై ముంబైకి చెందిన న్యాయవాది కేసు నమోదు చేశారు. అసభ్యకరంగా దుస్తులు వేసుకొని పబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ చేస్తున్నారంటూ బాంద్రా పోలీసులకు న్యాయవాది అలీ ఖాషిఫ్ ఖాన్ దేశ్‌ముక్ అంధేరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఉర్పీ జావెద్ మాత్రం ఎలాంటి పట్టింపు లేకుండా తేలికగా తీసుకున్నారు. కేసు నమోదు తర్వాత ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెడుతూ.. నాపై ఇంకా ఎన్ని కేసులు పెడుతారు. నన్ను రేప్ చేస్తామని, చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ నా దుస్తులు, నా వస్త్రధారణ గురించి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. నా వస్త్రధారణపై ఉన్న అభ్యంతరం.. మగవాళ్లు నాపై బలత్కారం చేస్తానని బెదిరించడంపై ఎందుకు లేదు. వారిపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదు అని ఉర్ఫీ జావెద్ ప్రశ్నించారు.
Read Also: Gujarat: కోట్లకు వారసురాలు.. అయినా 8 ఏళ్లకే సన్యాసం స్వీకరించింది..
అంతే కాకుండా ఒకవైపు బీజేపీ నేత చిత్రా వాగ్ ఉర్ఫీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కర్ణి సేన కూడా ఆమెను బెదిరించింది. ఇన్ని వివాదాల మధ్య ఇప్పుడు ఉర్ఫీ తన ఫ్యాషన్ గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని ఒప్పుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె బహిరంగంగానే చెప్పింది. “ఏది ఒప్పో ఏది తప్పో ఎవరు నిర్ణయిస్తారు? నేను కీర్తి ప్రతిష్టల కోసమే ఇదంతా చేస్తున్నాను అని సెలబ్రిటీలు అంటున్నారు. అవును, నేను ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఇదంతా చేస్తున్నాను. చిత్ర పరిశ్రమ అనేదే పాపులారిటీ సంపాదించడానికి.. ఫేమ్ పొందేందుకు ఇదంతే చేస్తే తప్పేంటి’ అని ఉర్ఫీ సమాధానమిచ్చింది. తనకు వస్త్రాదారణ విషయంలోనే ఇలా ఉన్నాను.. కానీ ఎలాంటి తప్పు చేయలేదని పునరుద్ఘాటించారు. తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని దమ్ముంటే మీరు మీ సంపదను ప్రకటిస్తారా.. ఒక రాజకీయ నాయకుడు ఎంత డబ్బు సంపాదిస్తాడో ముందుగా ప్రపంచానికి చెప్పాంలంటే చిత్రా వాఘ్‌కు ఆమె సూటిగా సవాలు విసిరారు.