TTE: నకిలీ టీటీఈ అవతారమెత్తిన ఆర్మీ జవాన్.. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ..
- నకిలీ టీటీఈ అవతారమెత్తిన ఆర్మీ జవాన్
- ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైళ్లలో అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు ఫేక్ టీటీఈ(ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) లుగా, టీసీలు(టికెట్ చెక్కర్స్)గా అవతారమెత్తి ప్రయాణికుల నుంచి వసూళ్లకు పాల్పడుతుంటారు. ఆ తర్వాత పోలీసులకు దొరికిపోతుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి కూడా ఇదేవిధంగా ఫేక్ టీటీఈగా వ్యవహరిస్తూ పోలీసులకు పట్టబడ్డాడు. అయితే ఇక్కడ షాకిచ్చే విషయం ఏంటంటే? ఓ ఆర్మీ జవాన్ నకిలీ టీటీఈగా వసూళ్లకు పాల్పడడం. రైలులో ప్రయాణికుల నుండి డబ్బు వసూలు చేస్తూ పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఝాన్సీ నుంచి గ్వాలియర్‌కు ప్రయాణిస్తున్న జీలం ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది.
Also Read:Carbide gun: దీపావళి రోజు ‘‘కార్బైడ్ గన్’’ విషాదం.. కంటిచూపు కోల్పోయిన 14 మంది చిన్నారులు..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
నివేదికల ప్రకారం, సైనికుడు కమల్ పాండే, TTEగా నటిస్తూ, రైలు బోగీలో ప్రయాణికుల నుండి డబ్బు వసూల్ కు పాల్పడ్డాడు. సీట్లు లేని ప్రయాణీకులకు సీట్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చి వారి నుంచి డబ్బు వసూలు చేశాడు. ఈ సమయంలో ఆ బోగీలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతేకాదు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కూడా ఈ సంఘటన గురించి ఫిర్యాదు చేశాడు.
Also Read:PM Modi: రేపటి నుంచే బీహార్‌లో మోడీ ఎన్నికల ప్రచారం.. ఎక్కడ నుంచంటే..!
ఫిర్యాదు అందిన వెంటనే, RPF బృందం స్పందించింది. జీలం ఎక్స్‌ప్రెస్ కోచ్‌లోకి వచ్చి నకిలీ టీటీఈని గుర్తించారు. ప్రయాణికుల నుండి డబ్బు వసూలు చేస్తుండగా వారు కమల్ పాండేను పట్టుకున్నారు. గ్వాలియర్ రైల్వే స్టేషన్‌లో అతన్ని దింపి GRPకి అప్పగించారు. నిందితుడు కమల్ పాండే ఆర్మీలో పనిచేస్తున్నాడని, ఉత్తరప్రదేశ్‌లో పోస్టింగ్ పొందాడని జిఆర్‌పి స్టేషన్ ఇన్‌చార్జ్ జితేంద్ర చందేలియా తెలిపారు. అతని వద్ద ప్రయాణికుల నుండి వసూలు చేసిన రూ.1,620 దొరికింది. అతనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!