మెదక్ జిల్లాలో ఆర్మీ జవాన్లకి పెను ప్రమాదం తప్పింది. రెస్క్యూ కోసం ట్రయల్ వేస్తుండగా బోటు బోల్తా పడింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది జవాన్లను రక్షించేందుకు రంగంలోకి దిగారు. తాళ్ల సాయంతో జవాన్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కాగా ఈ నెల 27న వినాయకుని విగ్రహం కొనుగోలు చేసేందుకు కామారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామానికి చెందిన 8 మంది చిన్నారులు మెదక్ కు వచ్చారు. భారీగా కురిసిన వర్షాలతో పోచారం వరద ఎక్కువ కావడంతో మూడు రోజులుగా పోచమ్మరాల్ గ్రామంలో చిన్నారులు తలదాచుకున్నారు.
Also Read:Samsung Galaxy A17 5G: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ.. మిడ్ రేంజ్ లో సామ్ సంగ్ గెలాక్సీ ఏ17 5G రిలీజ్
మూడు రోజులుగా గ్రామస్థులు 8 మంది చిన్నారుల ఆలన పాలన చూసుకున్నారు. ఈ క్రమంలో చిన్నారులను ఆర్మీ అధికారులు వారి ఇంటికి పంపేందుకు ప్రయత్నం చేయగా విఫలం అయ్యింది. దీంతో తిరిగి మెదక్ లోని పునరావాస కేంద్రానికి చిన్నారులను తరలించారు. కాగా మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలు వణికించిన విషయం తెలిసిందే. వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి.