Paidi Rakesh Allegations On Jeevan Reddy: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జీవన్ రెడ్డి తనని చంపేందుకు కుట్ర పన్నుతున్నారని, ఆయన అనుచరులు కాల్స్ చేసి బెదిరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జీవన్ రెడ్డి కూడా తనకు కాల్ చేశాడని మీడియా ముఖంగా రాకేష్ రెడ్డి చూపించారు. విదేశాల నుంచి తనని చంపుతామంటూ తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు. వారం రోజులుగా చంపతామని వందల కొద్ది బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు.
Also Read: Chandrababu: కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
ఈ కాల్స్ జీవన్ రెడ్డి చేపిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. జీవన్ రెడ్డి నీ అనుచరులకు చేప్పు.. ఇకనైనా ఈ అక్రమాలకు అపేయమని అంటూ మండిపడ్డారు. అక్రమ క్వారీ తవ్వకాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ సీబీఐ ఎంక్వైరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో సహజ సిద్ధమైన వనరులు కాపాడేందుకు తాను వచ్చానని, ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీ నిర్వహిస్తున్న యజమానులు ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలన్నారు. తనకు ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవని.. సహజ సిద్ధవనులను కాపాడేందుకే తాను వచ్చానని ఎమ్మెల్యే రాకేష్ పైడి వ్యాఖ్యానించారు.
Also Read: Cheating Case: రాయదుర్గంలో ఘరానా మోసం.. ఫోర్జరీ సంతకాలతో వందల కోట్ల కంపెనీనే కొట్టేశారు