ఎడ్యుకేషన్ పూర్తయ్యాక ఎదురయ్యే ఫస్ట్ క్వశ్చన్ నెక్ట్స్ ఏంటి? ఇంట్లో వాళ్లు, బంధువులు, ఫ్రెండ్స్, ఏంటీ ఇంకా జాబ్ చూసుకోలేదా? ఇంకెంత కాలం టైమ్ పాస్ చేస్తవ్ అంటూ కామెంట్ చేస్తుంటారు. కానీ రియాలిటీ విషయానికి వస్తే ప్రైవేట్ సెక్టార్ లో అయినా గవర్నమెంట్ సెక్టార్ లో అయినా హెవీ కాంపిటీషన్ ఉంది. మరీ ముఖ్యంగా ప్రైవేట్ జాబ్స్ అయితే గాల్లో దీపాల మాదిరి అయిపోయింది. దీంతో జాబ్స్ దొరక్క నిరద్యోగులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీకావు. మరి మీరు కూడా జాబ్ లేక వర్రీ అవుతున్నారా? అయితే 18 వేలకు పైగా జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఈ జాబ్స్ సాధిస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు.
Also Read:HYDRA : హైదరాబాద్‌లో నాలాల ఆక్రమణల తొలగింపు.. వరదల నివారణకు హైడ్రా చర్యలు
కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంక్ జాబ్స్ మొత్తం కలిపి 18,540 పోస్టులకు నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), ఎస్‌బీఐ (SBI), ఐబీపీఎస్ (IBPS), ఆర్‌ఆర్‌బీ (RRB) ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, డిప్లొమా మొదలైన విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. సీహెచ్ఎస్ఎల్-3131, ఎంటీఎస్-1075, జూనియర్ఇంజినీర్-1340 ఖాళీలతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read:Child Marriage: మరీ ఇంత దారుణమా..? 6 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల వ్యక్తి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 541 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఐబీపీఎస్ పలు బ్యాంకుల్లో పీఓలు (PO) 5,208, స్పెషలిస్ట్ ఆఫీసర్లు (SO) 1007 భర్తీకి రెడీ అయ్యింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 6,238 టెక్నీషియన్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్నవారు ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వెంటనే అప్లై చేసుకోండి.