Site icon NTV Telugu

Apple Watch 7: మహిళ ప్రాణాలను కాపాడిన ఆపిల్ వాచ్.. ఆపిల్ సీఈఓకు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి..

Apple Watch

Apple Watch

ఢిల్లీకి చెందిన పాలసీ పరిశోధకురాలు స్నేహ సిన్హాకు ఇటీవల యాపిల్ వాచ్ 7 బహుమతిగా లభించింది. ఇది చాలా ఫ్యాషన్‌గా, ట్రెండీగా ఉండడంతో ఆమెకు అది బాగా నచ్చింది. దాంతో ఆమె వాచ్ ధరించడం ప్రారంభించింది. ఆపిల్ వాచ్ 7లోని ఖచ్చితమైన ‘హార్ట్ రేట్ మానిటర్’ ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ విషయాన్ని ఆమె యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ కి తెలియజేసి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Chinaman: కార్మికులను బెల్టుతో తీవ్రంగా కొట్టిన చైనా వ్యక్తి.. చివరకు.. వీడియో వైరల్..

ఒక రాత్రి, ఆమె ఆపిల్ వాచ్ 7లోని హార్ట్ రేట్ మానిటర్ స్నేహ సిన్హాను అప్రమత్తం చేసింది. ఆపిల్ వాచ్ 7 ఆమె గుండె నిమిషానికి 250 బీట్స్ కంటే ఎక్కువగా కొట్టుకుంటోందని, ఇది చాలా అసాధారణమైనదని, వెంటనే ఆమె వైద్య సహాయం తీసుకోవాలని కోరింది. దాంతో, మరుసటి రోజు ఉదయం ఆసుపత్రికి వెళ్లాలని భావించిన స్నేహ.. వైద్యులు అప్రమత్తం కావడంతో వెంటనే అర్ధరాత్రి ఎమర్జెన్సీ ఆసుపత్రికి వెళ్లగా.. వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించారు. సమస్య వస్తే వెంటనే ఆస్పత్రికి రావాలని, లేకుంటే ప్రాణాపాయం ఉండేదని ఆమెకు తెలిపారు.

Also Read: T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ అంపైర్లు, రిఫరీలు లిస్ట్ వచ్చేసిందోచ్.. లిస్ట్ లో ఇండియన్స్..

ఈ విషయాన్ని అందరితో పంచుకుంటే బాగుంటుందని భావించిన స్నేహ సిన్హా ముందుగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ కు ఈమెయిల్ రాసింది. యాపిల్ వాచ్ 7 తన ప్రాణాలను కాపాడిందని అతనికి వివరించింది. వాచ్‌లో ఖచ్చితమైన హార్ట్ రేట్ మానిటర్‌ను అనుసంధానించినందుకు ఆపిల్ కుక్‌కు ధన్యవాదాలు తెలిపింది. వాస్తవానికి, ఆమె ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, మంచిగా., ఆరోగ్యంగా ఉన్నానని ఆమె వెల్లడించింది. తాను చాలా సార్లు ట్రెకింగ్ చేస్తుంటానని, ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్న 15,000 నుంచి 16,000 అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాలకు వెళ్లానని ఆమె చెప్పారు.

Exit mobile version