Matthew Breetzke: తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా ప్లేయర్ రికార్డ్..
- వన్డేల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన మాథ్యూ బ్రీట్జ్కే
- దక్షిణాఫ్రికాకు చెందిన యువ బ్యాట్స్‌మన్
- న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 150 పరుగులు చేసిన మాథ్యూ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్‌మన్ మాథ్యూ బ్రీట్జ్కే వన్డేల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. లాహోర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ మ్యాచ్‌లో 150 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు విండీస్‌కు చెందిన డెస్మండ్ హేన్స్ (148) పేరిట ఉండేది. కాగా.. ఈ సిరీస్‌లో ఆతిథ్య పాకిస్తాన్ కూడా ఉంది. ఈ సిరీస్‌లోని రెండవ మ్యాచ్ కొత్త గడాఫీ స్టేడియంలో జరుగుతోంది. అందులో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. తన తొలి వన్డే ఆడుతున్న మాథ్యూ, కెప్టెన్ టెంబా బావుమాతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించి 150 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు.
Read Also: Andhra Pradesh: కిరణ్ రాయల్పై ఆరోపణల కేసులో ట్విస్ట్.. లక్ష్మీరెడ్డిని అరెస్ట్!
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
మ్యాచ్ విషయానికొస్తే.. బావుమా తొందరగానే ఔటయ్యాడు.. ఆ తర్వాత మాథ్యూస్ వికెట్ కోల్పోకుండా.. జాసన్ స్మిత్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. జాసన్ 41 పరుగులు చేశాడు. వియాన్ ముల్డర్ 60 బంతుల్లో 64 పరుగులతో రాణించాడు. మాథ్యూతో కలిసి వంద పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. వీరిద్దరూ కలిసి 131 పరుగులు చేశారు. చివరికి, మాథ్యూ వికెట్ 263 స్కోరు వద్ద పడిపోయింది. అంతకు ముందే మాథ్యూ రికార్డు నెలకొల్పాడు. అతను 148 బంతుల్లో 11 ఫోర్లు, ఐదు సిక్సర్లు కొట్టాడు. 1971లో ఆవిర్భవించిన 54 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఒక బ్యాట్స్‌మన్ తన అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి.
Read Also: Laila: పృథ్వి రాజ్ కామెంట్స్ కలకలం.. షైన్ స్క్రీన్స్ కీలక ప్రకటన
అంతేకాకుండా.. వన్డే అరంగేట్రంలోనే సెంచరీ చేసిన నాల్గవ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌గా మాథ్యూ బ్రీట్జ్కే నిలిచాడు. మాథ్యూ కంటే ముందు.. కాలిన్ ఇంగ్రామ్ 2010లో జింబాబ్వేపై వన్డే అరంగేట్రంలో, 2016లో ఐర్లాండ్‌పై బావుమా, 2018లో శ్రీలంకపై రీజా హెడ్రిక్స్ సెంచరీ సాధించారు. మాథ్యూ దక్షిణాఫ్రికా తరఫున టెస్ట్, టీ20ల్లో కూడా అరంగేట్రం చేశాడు.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!