సాగరతీరం విశాఖలో మరో క్రికెట్ సందడి మొదలవ్వబోతోంది.. ఆంద్రా ప్రీమియర్ లీగ్ సీజన్-4 ప్రారంభం కాబోతుంది. మూడు సీజన్ లలో ఎందరో ప్లేయర్స్ కు మంచి ప్లాట్ ఫామ్ గా మారిన ఆంద్ర ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ACA ప్రతినిధులు.. ఏసిఏ-విడిసిఏ స్టేడియంలో వచ్చేనెల 8వ తేదీ నుంచి ఏపీఎల్ సీజన్ 4 ప్రారంభం కాబోతుంది. ఈ నెల 14 న ప్లేయర్స్ ఆక్షన్ జరగబోతుంది.. ఈసారి 7 ఫ్రాంచైజీలు వేలం పాట ద్వారా ప్లేయర్స్ ను కొనుగోలు చేయనున్నారు. ఐపీఎల్, టీమ్ ఇండియాలో ఆడుతున్న స్టార్ ప్లేయర్స్ నితీష్ కుమార్ రెడ్డి, కే ఎస్ భరత్, హనుమ విహారి, రికి బుయ్ లు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నరు.. 520 మంది ప్లేయర్స్ ను నాలుగు కేటగిరిలో వేలం పాటలో దక్కించుకొనున్నారు.