Fake TTE: ఎంతకు తెగించార్రా.. ఏకంగా నకిలీ టీటీఈగా వసూళ్లకు పాల్పడిన మహిళా..
- శుక్రవారం పాతాళకోట్ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో నకిలీ మహిళా టీటీఈ పట్టుబడటంతో కలకలం రేగింది.
- పాతల్‌కోట్ నుంచి చింద్వారా వెళ్లే పాతల్ కోట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో వసూళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake TTE: శుక్రవారం పాతాళకోట్ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో నకిలీ మహిళా టీటీఈ పట్టుబడటంతో కలకలం రేగింది. పాతల్‌కోట్ నుంచి చింద్వారా వెళ్లే పాతల్ కోట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో వసూళ్లు చేపట్టింది. ఇలా రైలులో ప్రయాణిస్తున్న వారిలో టికెట్లు లేని వారి దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేయడం మొదలు పెట్టింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే., రైలులో ప్రయాణం చేస్తున్న కొంతమందికి ఆమెపై అనుమానం రావడంతో వెంటనే ఆర్పిఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం బయటికి వచ్చింది.
Test Cricket: ఒకే టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసి 5 వికెట్లు తీసిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..?
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఓ ప్రయాణికుడు టికెట్ కలెక్టర్ గా వచ్చిన మహిళను తన ఐడి ప్రూఫ్ చూపించమని అడగగా.. ఆమె అందుకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా., అటు ఇటు చూస్తూ మిగతా వారిని టికెట్ ఇవ్వాలంటూ అడుగుతూ ఉంది. దీంతో అక్కడివారు అనుమానం వచ్చి వెంటనే ఆర్పిఎఫ్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు చర్యలు తీసుకున్నారు. ఆ మహిళను ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కి అప్పగించగా.. ఆమె సదరు నకిలీ టీటీఈని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. అయితే అక్కడ రైల్వే పోలీస్ స్టేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకోవడానికి నిరాకరించారు. ముందుగా ఆమె ఎందుకు అలా చేసింది..? ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి రైల్వే అధికారులు, పోలీస్ లు విచారణ చేపట్టారు. ఇలా చేయడానికి ఆమెకు ఎవరైనా రైల్వే అధికారులు సహాయం చేశారా..? లాంటి విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనతో ప్రయాణికుల భద్రత కోసం రైలు అధికారులు ఏం చేయాలన్న విషయంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఇక ఈ వైరల్ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి మహిళలు కూడా ఉంటారా..? అంటూ కొందరు ప్రశ్నిస్తుండగా.. అడ్డదారులలో డబ్బులు సంపాదించడానికి మరొక కొత్త మార్గాన్ని కనిపెట్టారంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
UP के झाँसी में पातालकोट से छिंदवाड़ा जा रही पातालकोट एक्सप्रेस में फ़र्ज़ी TTE युवती यात्रियों के टिकट चैक करती हुई मिली। शक होने पर यात्रियों ने इसकी सूचना @RPFCR को दी। CTI ने महिला कांस्टेबल के हवाले किया। अब युवती से पूछताछ जारी है। इधर RPF ने युवती को GRP थाने को सौंपा मगर… pic.twitter.com/ugq0trla84
— TRUE STORY (@TrueStoryUP) August 25, 2024
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!