Srisailam Water Release: గుడ్‌న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Water Release: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెబుతూ.. శ్రీశైలం డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశారు.. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో తాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. 2027 జూన్ వరకు సూపర్ ఎల్‌నినో ప్రభావం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలోని నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాల కోసం భద్రపరచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 119 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, రాబోయే పది రోజుల్లో మరో 100 టీఎంసీల వరకు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 63 శాతం వాటాను ముందుగా తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని స్పష్టం చేశారు.
రాయలసీమలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం నుంచి నీటి విడుదల చేపడుతున్నామని చెప్పారు మంత్రి నిమ్మల.. హంద్రీ-నీవా పరిధిలోని రిజర్వాయర్లకు 13 టీఎంసీల నీరు అవసరమని, అలాగే పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు తాగునీటి కోసం రేపటి నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక, తెలుగు గంగ పథకం ద్వారా చెన్నై తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉందని, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలోని తాగునీటి అవసరాల కోసం మరో 32 టీఎంసీల నీరు అవసరమని మంత్రి వివరించారు. వర్షాలు, వరదల పరిస్థితులను ప్రతి వారం సమీక్షిస్తూ ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేలా కార్యాచరణ రూపొందిస్తామని నిమ్మల రామానాయుడు తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో తాగునీటి భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు..
Also Read
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
తాజావార్తలు
-
UPI Transactions: యూపీఐ సేవలు ఉచితం కాదు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్‌న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!