వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 96లో సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారని, 30 ఏళ్లుగా ప్రాజెక్టు నిర్మాణం జరగడంపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రతి 15 రోజులకి ఒక సారి సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణంపై రివ్యూ చేస్తున్నారని, 2026 కల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం అని చెప్పారు. పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును వైఎస్ జగన్ జాతికి అంకితం అంటూ ప్రకాశం జిల్లా…
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ రంగాన్ని విధ్వంసం చేసిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కూటమి ప్రభుత్వం చివరి ఎకరం వరకు సాగు నీరందించేలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను గాడిలో పెడుతోందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారాయన. అమరావతి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్‌ఆర్ వంశధార, తోటపల్లి, వంశధార-నాగావళి లింక్, జంఝావతి, హిరమండలం లిఫ్ట్, నాగావళి- చంపావతి,…
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పర్యటనలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒకటో తారీకు వస్తే పండగ వాతావరణం నెలకొంటుందని.. వైసీపీ పాలనలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేందుకు ఐదేళ్లు పట్టిందన్నారు. జగన్ పింఛన్లు పెంచుతామని ప్రజలను మోసం దగా చేశారని.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి విషమంగా ఉన్న పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేస్తున్నామని తెలిపారు. ఏడాది పాలనలో పెద్ద ఎత్తున అభివృద్ధి…
కడపలో టీడీపీ ‘మహానాడు’ సంబరం మంగళవారం ప్రారంభమవుతోంది. టీడీపీ చరిత్రలో తొలిసారిగా వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చాయి. రేపటి నుండి మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు. మహానాడు పనుల్లో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బిజీగా ఉన్నారు. మహానాడు సభా ప్రాంగణ కమిటీ కన్వీనర్‌గా ఉన్న నిమ్మల.. వర్షం కారణంగా సభా ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. పార చేతపట్టి మట్టి…
ఎన్టీఆర్ నుండి చంద్రబాబు నాయుడు వరకు రాయలసీమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు . నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తరువాత రాయలసీమ ప్రజల నుండి ఎటువంటి స్పందన వచ్చిందో, మరల ఇప్పుడు 2024 ఎన్నికల్లో అదే స్థాయిలో ఆదరణ వచ్చిందన్నారు. ఇరిగేషన్ రంగంలో తెలుగు గంగ, జిఎన్ఎస్ఎస్, హంద్రీనీవా, హెచ్ఎల్ సి ఇలా ఎన్నో ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే నిర్మించామన్నారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కంటే రాయలసీమలోని హంద్రీనీవా ప్రాజెక్టుకే…
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. రైతుల అవసరాల కోసం చెరువుల్లో పూడిక తీసిన మట్టిని, క్యూబిక్ మీటర్ ఒక్క రూపాయుకే, రైతులకు సరఫరా చేసేలా అనుమతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారని తెలిపారు.
2019-24 వైసీపీ ప్రభుత్వంలో 32 వేల కోట్లు కేటాయిస్తే, కేవలం 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం 35 వేల కోట్లు ఇరిగేషన్ శాఖకు కేటాయించింది.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించారు అని ఆరోపించారు. మహేంద్ర తనయ ప్రాజెక్ట్ లను నిర్వీర్యం చేశారు.. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ హయాంలో అసెంబ్లీ స్పీకర్, రెవెన్యూ మంత్రి, పశుసంవర్ధక మంత్రి ఉన్నా, ఈ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులకు చేసింది శూన్యం అంటూ మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.
పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం.. వరుసగా మూడోసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మంత్రి నిమ్మల రామానాయుడు. మినిస్టర్‌గా రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో హవా నడిపిస్తున్నా... సొంత సెగ్మెంట్‌లో మాత్రం.... ఇంట్లో ఈగల మోత అన్నట్టుగా తయారైందట ఆయన పరిస్థితి.
Minister Nimmala: నేటి నుంచి రాజమండ్రి జిల్లాలో 45 ఇసుక ర్యాంపులకు అనుమతి ఇస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి వరదల నేపథ్యంలో నాలుగు నెలలు ఇసుక కొరత రాకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యగా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
వైసీపీ పాలనలో కాలువలు, డ్రెయిన్స్‌లో తట్ట మట్టి కూడా తీయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గత పాలనలో లాకులు, షట్టర్లు, డోర్స్ మరమ్మతులు మాట అటుంచి.. గ్రీజు వంటి మెయింటనేన్స్ కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ సరిగా చేయలేదని, ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయినా గత సీఎం కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. ప్రాజెక్టు పనుల నిమిత్తం సీఎం చంద్రబాబు రూ.380 కోట్లు ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించుకున్నా..…