Minister Vishwaroop: తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపుతున్నాయి.. ఏపీ మంత్రులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హరీష్‌రావుకు కౌంటర్‌గా కామెంట్లు చేస్తున్నారు.. తాజాగా మంత్రి విశ్వరూప్ స్పందిస్తూ.. తెలంగాణ మంత్రి హరీష్ రావు.. ఏపీలో అభివృద్ధి లేదనడం ఆయన అజ్ఞానం.. ఇదే సమయంలో తెలంగాణ అభివృద్ధి జరిగిందనడం హాస్యాస్పదంగా పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రులందరూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గానీ, చంద్రబాబు గానీ.. అందరూ రాజధానిగా భావించి హైదరాబాద్ ను అభివృద్ధి చేశారన్న ఆయన.. ఏపీలో గత ఐదేళ్లుగా అభివృద్ధిలో వెనుకబడినా.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హయంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కడప ఇలా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు.. మరోవైపు.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వదులుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు మంత్రి విశ్వరూప్.
Read Also: More Layoffs in Google: గూగుల్ సీఈవో సంచలన వ్యాఖ్యలు.. ఉద్యోగులకు కొత్త టెన్ష్..
కాగా, కార్మికులను ఉద్దేశిస్తూ.. తెలంగాణలోనే ఓటు నమోదు చేయించుకోండి అంటూ హరీష్‌రావు సూచించిన విషయం విదితమే.. ఈ సందర్భంగా ఏపీలో రోడ్లు.. తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు తదితర అంశాలను ప్రస్తావించారు.. ఇదే.. రాజకీయ రచ్చకు కారణంగా మారింది.. ఈ విషయంలో సీరియస్‌గా స్పందించిన మంత్రులు.. దమ్ముంటే రండి.. ఏపీలో జరుగుతోన్న అభివృద్ధిని చూడండి.. సంక్షేమ పథకాల అమలును పరిశీలించండి అంటూ సవాల్ చేశారు.. ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకోండి అని కొందరు హితవుపలకగా.. ఒక్క వర్షానికి హైదరాబాద్ మునిగిపోతుంది అంటూ.. మరికొందరు కౌంటర్ ఎటాక్‌కు దిగిన విషయం విదితమే.