వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర 40వ రోజుకు చేరుకుంది. ఈ బస్సుయాత్ర డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో సాగింది. యాత్ర అనంతరం మల్కిపురం ప్రధాన సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించారు.
Off The Record: అమలాపురం వైసీపీలో విభేదాలు నివురుగప్పిన నిప్పులా వున్నాయన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు….మినిస్టర్లు, ఎంపీల మధ్య కోల్డ్ వార్ ఎప్పుడైనా బద్దలవుతుందన్న డిస్కషన్ సాగుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం ఎంపీ చింతా అనూరాధ మధ్య భగ్గుమంటున్న విభేదాలే. చింతా అనూరాధ పార్టీలో చేరిన తర్వాత…స్వగ్రామం మొగళ్ళమూరుకు ర్యాలీగా వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో… అనూరాధ ఫొటో పెద్దదిగా వేసి సీనియర్…
Minister Vishwaroop: తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపుతున్నాయి.. ఏపీ మంత్రులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హరీష్‌రావుకు కౌంటర్‌గా కామెంట్లు చేస్తున్నారు.. తాజాగా మంత్రి విశ్వరూప్ స్పందిస్తూ.. తెలంగాణ మంత్రి హరీష్ రావు.. ఏపీలో అభివృద్ధి లేదనడం ఆయన అజ్ఞానం.. ఇదే సమయంలో తెలంగాణ అభివృద్ధి జరిగిందనడం హాస్యాస్పదంగా పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రులందరూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గానీ, చంద్రబాబు గానీ.. అందరూ రాజధానిగా భావించి హైదరాబాద్ ను అభివృద్ధి చేశారన్న…
రాజకీయాల్లో ఒక స్టేజ్‌కు వచ్చాక.. వారసులను బరిలో దించాలని చూస్తారు నాయకులు. ఒక్కరే కొడుకో.. కూతురో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎక్కువ మంది సంతానం ఉన్నప్పటికీ ఒక్కోసారి ఒక్కరే పోటీ చేస్తారు. అలాంటి సమయంలోనూ పెద్దగా ఇక్కట్లు ఎదురు కాబోవు. కానీ.. ఇంట్లో ఉన్న వారసులంతా పోటీ చేస్తామని భీష్మిస్తే..! వారసులతోపాటు తండ్రి కూడా పోటీ చేస్తానని మొండి కేస్తే..! ఇంటిలోనే రాజకీయ రసకందాయంలో పడటం ఖాయం. మంత్రి విశ్వరూప్ సైతం ఇదే ఇరకాటంలోనే పడ్డారట.…
ఆంధ్రప్రదేశ్ మంత్రి విశ్వరూప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం అమలాపురంలో నిర్వహించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత అస్వస్థతకు గురైనట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.. దీంతో.. హుటాహుటిన మంత్రి విశ్వరూప్‌ను.. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అనుచరులు.. ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్ష పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఎలా…
కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ మే 24న అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అంతేకాకుండా పోలీసులపై రాళ్ల దాడి కూడా చేశారు. ఇప్పటికే ఈ అల్లర్లకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా అమలాపురం అల్లర్ల కేసులో మంత్రి విశ్వరూప్ అనుచరులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు సత్యరుషి, సుభాష్, మురళీకృష్ణ, రఘుపై కేసు…
రాష్ట్రంలో నూతనంగా కాలుష్యరహిత ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తామని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు. కోనసీమ జిల్లా మామిడికుదురులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల నుంచి తిరుపతికి నడిపేందుకు పైలట్ ప్రాజెక్టుగా 100 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి విశ్వరూప్ తెలిపారు. అనంతరం దశల వారీగా విశాఖపట్నం, విజయవాడతో పాటూ ప్రధాన నగరాల మధ్య ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో రవాణా వ్యవస్థను పటిష్టం…
రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సి రావటం బాధాకరంగా ఉందని మంత్రి విశ్వరూప్ వ్యాఖ్యానించారు. శనివారం అన్నవరం సత్యదేవుడిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలపై ఛార్జీల భారం మోపడం బాధగానే ఉన్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో అనివార్యంగా ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే ఆర్టీసీ బస్సు ఛార్జీలు తక్కువగా ఉన్నాయని మంత్రి విశ్వరూప్ వెల్లడించారు. ప్రస్తుతం డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న కారణంగా…