కోర్టు ధిక్కార కేసులో నోటీసులు పంపకుండానే వకాల్తా దాఖలు చేయడం పై హైకోర్ట్ సీరియస్ అయింది. నోటీసులు పంపకుండా వకాల్తా తీసుకున్న కోర్టు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలు జారీచేశారు. కృష్ణాజిల్లా మొవ్వ మండల డిప్యూటీ తాహసీల్దార్ సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో గతంలో కోర్టు ఆదేశాలు జారీచేసింది.
కోర్టు ఆదేశించిన సమాచారం ఇవ్వకపోవడంతో కోర్టు ధిక్కార పిటీషన్‌ను దాఖలు చేశారు న్యాయవాది కే.తులసీదుర్గాంబ. నోటీసులు వెళ్లకుండానే వకాల్తా దాఖలు చేసిన అంశాన్ని మంగళవారం విచారణ సందర్బంగా కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు న్యాయవాది తులసీ దుర్గాంబ. నోటీసులు ఇవ్వకుండా వకాల్తా ఎలా దాఖలు చేస్తారని నిలదీసింది ఏపీ హైకోర్టు.
సంబంధిత సెక్షన్‌లోని ఉద్యోగుల పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రిజిస్ట్రార్‌ను ఆదేశించిన హైకోర్టు. ఈ నేపథ్యంలో బేషరతుగా క్షమాపణ చెప్పారు హైకోర్టు రిజిస్ట్రార్ సిబ్బంది.
Read Also: TTD: పాలకమండలిలో నేరచరితులు… కేసు జూన్ 20కి కేసు వాయిదా