Ap Highcourt: సంక్షేమ వసతి గృహాల దుస్థితిపై హైకోర్ట్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ వసతిగృహాల నిర్వహణ తీరుపై ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. తమది తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ అని చెబుతున్న సాంఘిక సంక్షేమశాఖ.. రూ.16 లక్షల ఖర్చుతో ఓ వసతిగృహానికి అదనపు అంతస్తును నిర్మించలేకపోతున్నారా అని ప్రశ్నించింది. రూ.వేల కోట్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పది మంది విద్యార్థులకు మాత్రమే సరిపోయే గదిలో 36 మంది ఉంటున్నారని, దీనిని బట్టి చూస్తే వసతిగృహాలు ఎలాంటి అధ్వాన్న స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించింది.
136 మంది విద్యార్థినులు కేవలం రెండు మరుగుదొడ్లు, మూడు స్నానపుగదులతో సర్దుకుపోవాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడిందని కోర్టు ముందు హాజరైన సంక్షేమశాఖ డైరెక్టర్ హర్షవర్ధన్‌ను నిలదీసింది. వివిధ అంశాలపై న్యాయస్థానం లేవనెత్తుతున్న విషయాలను సమీక్ష సమావేశాల్లో ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారంపై దాఖలైన ఓ వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారం విద్యాశాఖకు చెందిందని.. ఆ విషయంలో నోడల్ ఏజెన్సీగా పని చేయాల్సిన అవసరం సంక్షేమ శాఖకు ఎందుకు వచ్చిందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ముందు మీ శాఖ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. 2017లో ప్రారంభించిన వసతిగృహం అదనపు గది నిర్మాణానికి రూ.16 లక్షలు కేటాయించకపోవడం ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. వసతి గృహాల్లో వసతులు మెరుగుపరచాలని, విద్యార్ధినులకు వార్తాపత్రికలు అందచేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
Read Also: Mansukh Mandaviya: విజయనగరం జిల్లాలో కేంద్రమంత్రి టూర్
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!