Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమలో నటీమణుల పాత్రల చిత్రీకరణపై బయట వినిపించే నీతులు, వ్యక్తిగత ప్రవర్తనకు మధ్య ఉండే తేడా ఎప్పటికప్పుడు బట్టబయలు అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కన్నడ భామ, టాలీవుడ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు, ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఆమె గతంలో చేసిన నీతిబోధలకు, తాజాగా పోస్ట్ చేసిన వివాదాస్పద చిత్రానికి మధ్య ఉన్న వైరుధ్యమే. ఇటీవల ‘పెద్ది’ చిత్రం విడుదల సమయంలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణ, హీరోయిన్ అంగసౌష్టవంపై కెమెరా కోణాలు పెట్టడం చుట్టూ తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆషికా రంగనాథ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ మేకర్స్‌పై నిప్పులు చెరిగారు. “హీరోయిన్లను తప్పుపట్టకండి… ఇలాంటివే అమ్ముడుపోతాయని ఇంకా భ్రమపడుతున్న వ్యవస్థను (సిస్టమ్‌ను), దర్శకులను నిందించండి” అంటూ సుదీర్ఘమైన పోస్ట్‌తో నీతులు చెప్పారు. మహిళలను కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటున్నారంటూ ఇండస్ట్రీ ఆలోచనా విధానాన్ని ఎండగట్టారు.
ఆ వ్యాఖ్యలు చేసి కొద్దిరోజులు గడవకముందే ఆషికా తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఓ ఫొటో తీవ్ర దుమారానికి దారితీసింది. తన మొహం కూడా కనిపించకుండా కేవలం నడుము, శరీరాకృతిని మాత్రమే ఫోకస్ చేస్తూ క్రాప్ చేసిన ఫొటోను ఆమె ప్రొఫైల్‌లో అప్లోడ్ చేశారు. దీనిపై నెటిజన్లు సూటిగా విరుచుకుపడుతున్నారు. సినిమాల్లో దర్శకులు గ్లామర్‌గా చూపిస్తే “సిస్టమ్ తప్పు” అని వేలెత్తి చూపే మీరు, ఇప్పుడు స్వయంగా ముఖాన్ని కత్తిరించి కేవలం శరీరాన్ని హైలైట్ చేస్తూ ఫొటో పెట్టడానికి ఏ వ్యవస్థ బలవంతం చేసింది? వ్యూస్, లైకుల కోసం సొంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి కంటెంట్‌ను ప్రదర్శించడం Hypocrisy కాదా? తాను మెడలో ధరించిన కెమెరా లాకెట్ ను చూపించే ఉద్దేశంతోనే ఈ ఫొటో పెట్టానని ఆషికా చెప్పుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, నెటిజన్లు మాత్రం ఆమె ఇచ్చిన ఉపన్యాసాలను గుర్తుచేస్తూ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. తెరపై గ్లామర్ చూపిస్తే వ్యవస్థ లోపం అని మాట్లాడి, సొంత ఖాతాలో ముఖం లేకుండా శరీరాన్ని ప్రదర్శించడం శుద్ధ కపటత్వమేనని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!