Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bellam Paramannam పండుగలొచ్చినా, ఇంట్లో పూజలు లేదా శుభకార్యాలు జరిగినా నైవేద్యంగా ముందుగా గుర్తొచ్చేది బెల్లం పరమాన్నం. అయితే చాలా మందికి పరమాన్నం వండేటప్పుడు పాలు విరిగిపోవడం లేదా కాసేపటికే చేసిన ప్రసాదం రాయిలా గట్టిపడిపోవడం, లేదంటే మరీ నీళ్లలా మారిపోవడం జరుగుతుంటుంది. అసలైన కమ్మదనం దక్కక నిరాశ చెందుతుంటారు. ఆలయాల్లో పెట్టే ప్రసాదంలా నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయేలా, చల్లారినా అదే క్రీమీ టెక్స్చర్తో ఉండాలంటే సరైన పద్ధతి, కొలతలు పాటించాల్సిందే. ఆ అసలైన సీక్రెట్స్, తయారీ విధానం ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
పర్ఫెక్ట్ కొలతలు (ఒకే గ్లాసుతో):
* బియ్యం: 1 గ్లాసు
Also Read
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
* చిక్కటి పాలు: 4 గ్లాసులు
* నీళ్లు: 2 గ్లాసులు (రైస్ ఉడికించడానికి), అర గ్లాసు (పాకం కోసం)
* తురిమిన బెల్లం: 2 గ్లాసులు
* యాలకుల పొడి: అర టీస్పూన్
* పచ్చికర్పూరం: చిటికెడు (తినేది మాత్రమే)
* నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
* జీడిపప్పు, కిస్మిస్: సరిపడా
తయారీ విధానం:
ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగి, కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల అన్నం పాలల్లో త్వరగా, మెత్తగా ఉడుకుతుంది. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి 4 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్లు పోయాలి. ఇలా నీళ్లు కలపడం వల్ల పరమాన్నం చిక్కదనం సరైన రీతిలో వస్తుంది. పాలు పొంగి వచ్చాక, నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు లేకుండా అందులో వేయాలి. మంటను లో-టు-మీడియం ఫ్లేమ్‌లో ఉంచి అన్నాన్ని నిదానంగా మెత్తగా ఉడికించాలి. అన్నం మెత్తగా, దగ్గరగా (దద్దోజనం కన్సిస్టెన్సీలా) ఉడికిన తర్వాత అవసరమైతే గరిటతో కొద్దిగా మెదపాలి. ఇప్పుడు ఇందులోనే అర టీస్పూన్ యాలకుల పొడి, గుడి ప్రసాదం సువాసన కోసం చిటికెడు పచ్చికర్పూరం వేసి కలిపి స్టవ్ కట్టేసి మూతపెట్టి పక్కన ఉంచాలి.
అసలైన సీక్రెట్ – తీగపాకం:
చాలామంది బెల్లం కరిగిన వెంటనే ఆ నీళ్లను నేరుగా అన్నంలో కలిపేస్తారు. దీనివల్ల చల్లారిన కాసేపటికి ప్రసాదం నీరైపోతుంది. అలా జరగకూడదంటే.. ఒక గిన్నెలో 2 గ్లాసుల తురిమిన బెల్లం, అర గ్లాసు నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం కరిగాక మంటను తగ్గించి లేత తీగపాకం వచ్చే వరకు దానిని మరిగించాలి. తీగపాకం రాగానే స్టవ్ ఆపి, ఒక నిమిషం పాటు ఆగి, ఆ వేడి పాకాన్ని వడకడుతూ పక్కన పెట్టుకున్న పాలన్నంలో పోసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల పాలు విరిగే అవకాశమే ఉండదు. పైగా ఎంత చల్లారినా పరమాన్నం గట్టిపడకుండా క్రీమీగా ఉంటుంది.
చివరగా స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి, జీడిపప్పు, కిస్మిస్లను దోరగా వేయించాలి. బంగారు రంగులోకి రాగానే నేతితో సహా పరమాన్నంలో వేసి కలిపేస్తే ఘుమఘుమలాడే అమృతం లాంటి బెల్లం పరమాన్నం రెడీ అయిపోతుంది. ఈ చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తూ చేస్తే మొదటిసారి చేసేవారు కూడా వందకు వంద మార్కులు కొట్టేయొచ్చు.
తాజావార్తలు
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!