ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ వసతిగృహాల నిర్వహణ తీరుపై ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. తమది తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ అని చెబుతున్న సాంఘిక సంక్షేమశాఖ.. రూ.16 లక్షల ఖర్చుతో ఓ వసతిగృహానికి అదనపు అంతస్తును నిర్మించలేకపోతున్నారా అని ప్రశ్నించింది. రూ.వేల కోట్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పది మంది విద్యార్థులకు మాత్రమే సరిపోయే గదిలో 36 మంది ఉంటున్నారని, దీనిని బట్టి చూస్తే వసతిగృహాలు ఎలాంటి అధ్వాన్న స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించింది. 136 మంది…
ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 24 వరకు పుష్కరాలు జరగనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రాణహిత నది పరీవాహకం వెంట పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీగా హాజరవుతున్నారు. గోదావరి ఉప నది ప్రాణహిత పుష్కరాలు ఇవాళ మొదలయ్యాయి. మీనరాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరం రానుంది. చైత్రశుద్ధ ద్వాదశి నుంచి చైత్రశుద్ధ బహుళ అష్టమి అంటే ఈ నెల 24 వరకు 12 రోజుల…
ఏపీ సీఎం జగన్ తన మాటకు కట్టుబడి కొత్త జిల్లాలను ఏర్పాటుచేశారు. రేపటినుంచి కొత్తజిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నాం అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. అయితే వసతులు,సదుపాయాలు లేకుండా కొత్త జిల్లాల్ని ఏర్పాటుచేస్తే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. అమరావతి తరహాలో కొత్త జిల్లాలను చేయవద్దన్నారు. అమరావతి అభివృద్ధికి నిధులివ్వాలని కేంద్రాన్ని ఎందుకు అడగడంలేదన్నారు జీవీఎల్. 2019 ఎన్నికల్లో 26 జిల్లాల ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించాం. ఏపీలో…
తెలంగాణలో టీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్, బీజేపీలు వరుసగా మాటల దాడి చేస్తూనే వున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ పై మళ్ళీ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై సోమవారం తీవ్ర విమర్శలు చేశారు. వేములవాడలో బండి సంజయ్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మహా శివరాత్రి అనేది అనుకోకుండా వచ్చే పండగ కాదు. వేములవాడలో శివరాత్రి సందర్భంగా ఒక…