ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ వసతిగృహాల నిర్వహణ తీరుపై ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. తమది తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ అని చెబుతున్న సాంఘిక సంక్షేమశాఖ.. రూ.16 లక్షల ఖర్చుతో ఓ వసతిగృహానికి అదనపు అంతస్తును నిర్మించలేకపోతున్నారా అని ప్రశ్నించింది. రూ.వేల కోట్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పది మంది విద్యార్థులకు మాత్రమే సరిపోయే గదిలో 36 మంది ఉంటున్నారని, దీనిని బట్టి చూస్తే వసతిగృహాలు ఎలాంటి అధ్వాన్న స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించింది. 136 మంది…