YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YCP Protest on AP DSC Sports Quota Row: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వివాదం కొనసాగుతోంది. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు విజయవాడలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు శాప్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలకు శాప్ ప్రధాన కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటితో శాప్ కార్యాలయానికి వస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైసీపీ స్పష్టం చేసింది. ముఖ్యంగా నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొంది. నిరసనలో భాగంగా విజయవాడలోని శిఖామణి సెంటర్ నుంచి శాప్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని వైసీపీ పిలుపునిచ్చింది. అయితే ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. నగరంలో 30, 163 యాక్ట్ అమల్లో ఉందని పేర్కొంటూ.. అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఇదిలా ఉండగ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు కూడా తమపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. ఆదివారం విజయవాడలో సుమారు 370 మంది స్పోర్ట్స్ కోటా టీచర్లు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి తమ నియామకాలను సమర్థించారు. తమ క్రీడా ప్రతిభ, అర్హతల ఆధారంగానే ఉద్యోగాలు పొందామని వారు స్పష్టం చేశారు. తమను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ఆరోపణలు చేయవద్దని.. తమ సర్టిఫికెట్లు, క్రీడా రికార్డులను పరిశీలించవచ్చని టీచర్లు పేర్కొన్నారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలను వారు ఖండిస్తూ.. తమ నియామకాలు నిబంధనల ప్రకారమే జరిగాయని చెబుతున్నారు. వైసీపీ ర్యాలీ నిర్వహిస్తే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు కూడా పోటీగా ర్యాలీ చేపట్టే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఒకవైపు వైసీపీ ఆందోళనకు సిద్ధమవుతుండగా.. మరోవైపు తమపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ స్పోర్ట్స్ కోటా టీచర్లు కూడా కార్యక్రమం చేపట్టే అవకాశం ఉండటంతో విజయవాడలో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
- Tags
- ap
- DSC 2025
- ycp
- YCP Protest
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!