CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్రిగోల్డ్ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఈ కేసులో అదనపు ఆస్తులను జప్తు చేయాలని ఆదేశిస్తూ ఏపీ హోంశాఖ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 9.87 ఎకరాల విలువైన భూములను అటాచ్ చేసేందుకు సీఐడీ డీజీకి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
కృష్ణా జిల్లా పరిధిలోని పోరంకి, పెనమలూరు, ఈదర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 6.55 ఎకరాల భూమితో పాటు, పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని అనేకల్ ప్రాంతంలో ఉన్న 3.32 ఎకరాల స్థలాన్ని హోంశాఖ జప్తు చేయనుంది. అగ్రిగోల్డ్ సంస్థ యాజమాన్యం అమాయక డిపాజిటర్ల సొమ్మును అక్రమంగా మళ్లించి ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్లు విచారణాధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో “డిపాజిటర్ల పరిరక్షణ చట్టం” కింద ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
లక్షలాది మంది బాధితులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), ఏపీ సీఐడీ సంయుక్తంగా వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసి, బాధితులకు పంపిణీ చేసేందుకు న్యాయస్థాన అనుమతులు పొందాయి. కొత్తగా గుర్తించిన బినామీ, అక్రమ ఆస్తులను వేలం వేసి వచ్చిన మొత్తాన్ని డిపాజిటర్లకు అందజేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ చర్యలతో ఏళ్ల తరబడి వేచి చూస్తున్న అగ్రిగోల్డ్ బాధితుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..