AP Govt: విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతోన్న బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యార్థుల డైట్ ఛార్జీలను 10 శాతం పెంచుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సచివాలయంలో సంక్షేమ శాఖలపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించినప్పటికీ, విద్యార్థుల పౌష్టికాహారం దృష్ట్యా ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే పెంచిన డైట్ ఛార్జీలను వర్తింపజేయాలని సీఎం స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందని ఆయన నొక్కిచెప్పారు.
ఇక హాస్టళ్లు కాదు… గురుకులాలే నిర్మిద్దాం..
రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు వీలుగా ఇకపై హాస్టళ్ల స్థానంలో పెద్ద ఎత్తున గురుకులాల (రెసిడెన్షియల్ స్కూళ్లు) నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దాలని, వీటిలో నెట్‌జీరో విధానాన్ని, బయో డైవర్శిటీ పార్కుల తరహా వాతావరణాన్ని తీసుకురావాలన్నారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల తక్షణ మరమ్మత్తుల కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read
- Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
- Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
- Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు..
గురుకులాల్లో చదివే మెరిట్ విద్యార్థులను ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు బెస్ట్ టీచర్స్ ద్వారా క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వాలని, ఇందుకోసం పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ప్రారంభించాలని సీఎం సూచించారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను మ్యాపింగ్ చేసి పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం పెంచాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక వైద్య విభాగం, హోం సిక్ను అధిగమించేందుకు తల్లిదండ్రులతో మాట్లాడే స్మార్ట్ కార్డ్ టెలిఫోన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హర్షం..
ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గత వైసీపీ హయాంలో హాస్టళ్లు, గురుకులాలు సమస్యలకు నిలయాలుగా మారాయని ఆయన విమర్శించారు. కేవలం రెండేళ్ల కాలంలోనే సంక్షేమ హాస్టళ్లలో సమూల మార్పులు తీసుకొచ్చామని, పేద విద్యార్థులకు కార్పొరేట్ దీటుగా నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందిస్తున్నామని చెప్పారు. పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడదని మంత్రి స్వామి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
-
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!