శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్‌గా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టే సాయిని నియమించింది కూటమి ప్రభుత్వం.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఓ ధర్నాలో కార్యక్రమంలో పాల్గొన్న సాయిని.. అప్పటి శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ చెంప దెబ్బలు కొట్టి.. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.. సాయిని కొట్టిన వీడియోలు అప్పట్లో వైరల్‌గా మారాయి.