Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం మన శివశంకర్ వరప్రసాద్ గారు విడుదలకు సిద్ధమవుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా అభిమానులకు ముఖ్యంగా సినిమా టీంకి అదిరిపోయే తీపి కబురు అందించింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపుతో పాటు, స్పెషల్ షోలకు అనుమతినిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది.
READ ALSO: Question Paper Leak : అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ గుట్టురట్టు.. 35 మంది విద్యార్థులపై వేటు..!
మెగాస్టార్ సినిమా అంటేనే బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది, ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీ రిలీజ్ కావాల్సి ఉంది కానీ సినిమా విడుదల కావడానికి ముందే, అంటే జనవరి 11వ తేదీ రాత్రి 8 గంటల నుండి 10 గంటల మధ్య ఒక ప్రత్యేక షో వేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్పెషల్ షో కోసం టికెట్ ధరను రూ. 500గా ఖరారు చేశారు. మెగాస్టార్‌ను వెండితెరపై ముందుగా చూడాలనుకునే అభిమానులకు ఇది ఒక గొప్ప అవకాశం.
విడుదల తర్వాత కూడా సినిమా వసూళ్లకు మరింత బూస్ట్ ఇచ్చేలా టికెట్ ధరల పెంపునకు అనుమతి లభించింది. జనవరి 12 నుండి వరుసగా 10 రోజుల పాటు ఈ పెంచిన ధరలు అమలులో ఉంటాయి. సాధారణ ధర కంటే రూ. 100 అదనంగా పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఇక్కడ ఒక్కో టికెట్‌పై రూ. 125 వరకు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. మెగా అభిమానులు మాత్రం తమ ‘శంకర్ వరప్రసాద్’ గారిని బిగ్ స్క్రీన్‌పై చూడటానికి ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే రాజా సాబ్ సినిమాకి కూడా సినిమా రిలీజ్ కి కొద్దిరోజులు ముందే ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించారు కానీ తెలంగాణలో మాత్రం కల్పించలేదు మరి ఈ సినిమా కైనా కల్పించే అవకాశం ఉందో లేదో చూడాలి.
READ ALSO: Ram Gopal Varma: సెన్సార్ బోర్డుపై రామ్‌గోపాల్ వర్మ ఫైర్..!