Ram Gopal Varma: దళపతి విజయ్ చివరి సినిమాగా భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ‘జన నాయగన్’.. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో ఈ రోజు థియేటర్లలోకి రాలేకపోయింది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మొదట్లో 27 కట్స్‌తో U/A రేటింగ్ సూచించినా.. ఆ తర్వాత అకస్మాత్తుగా రివైజింగ్ కమిటీకి పంపడంతో ఒక్కసారిగా సంగతులు తారుమారయ్యాయి. దీంతో సెన్సార్ బోర్డు తీరుపై మేకర్స్ హైకోర్టుకు వెళ్లారు.
READ ALSO: Mamata Banerjee: అమిత్ షా “పెన్‌డ్రైవ్” నా దగ్గర ఉంది.. అది బయటకు తెస్తే..
హైకోర్టు సింగిల్ జడ్జి CBFCకు U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. అదే రోజు సాయంత్రానికి CBFC అప్పీల్ చేయడంతో చీఫ్ జస్టిస్ బెంచ్ ఆ ఆదేశాలపై స్టే ఇచ్చింది. ఇప్పుడు మరో హియరింగ్‌కు షెడ్యూల్ అయ్యే వరకు సినిమా రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో సెన్సార్ బోర్డుపై ఫైర్ అయ్యారు. “ఇప్పుడున్న ఇంటర్నెట్ యుగంలో ఎక్కడపడితే అక్కడ అన్‌రెస్ట్రిక్టెడ్ కంటెంట్ ఫ్రీగా తిరుగుతుంటే.. సినిమాలకు మాత్రం సెన్సార్ బోర్డు ఎందుకు? కట్స్ కాదు.. ఏజ్ రేటింగ్స్, వార్నింగ్స్ చాలు. ఇది రాజ్యాంగంలోని ఎక్స్‌ప్రెషన్ ఫ్రీడమ్‌కు వ్యతిరేకం” అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇక ఈ వివాదం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఇదే ఆయనకు ఆఖరి చిత్రంగా చెబుతున్నారు. అందుకే ఇలాంటి అడ్డంకులు వస్తున్నాయని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే.. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? రిపబ్లిక్ డే స్పెషల్‌గా వస్తుందా? లేకపోతే ఈ డేట్‌కు కూడా మరోక ట్విస్ట్ ఉందా? ప్రస్తుతం సెన్సార్ బోర్డు విధానాలు, డిజిటల్ యుగంలో సినిమా స్వేచ్ఛపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. విజయ్ ఫ్యాన్స్ మాత్రం.. తమ దళపతి చివరి జర్నీని గ్రాండ్‌గా చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.
CENSOR BOARD is OUTDATED
Not in the context of just @Actor_Vijay ‘s #JanaNayagan ‘s censor issues but in an overall manner, it is truly foolish to think that the censor board is still relevant today
It has long outlived it’s purpose, but it’s being kept alive out of laziness…
— Ram Gopal Varma (@RGVzoomin) January 9, 2026
READ ALSO: Stock Market Crash: స్టాక్ మార్కెట్ క్రాష్ .. రూ.13 లక్షల కోట్లు ఆవిరి! రీజన్స్ ఇవే..