తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 24 మంది సభ్యులతో పాటు మరో నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఈ పాలకమండలిలో ఉండనున్నారు. అయితే.. ఈ ఎక్స్ అఫీషియో సభ్యులుగా దేవాదాయ శాఖ స్పెషల్ సీఎస్, కమీషనర్, టీటీడీ ఛైర్మన్, టీటీడీ ఈవోలను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా చోటు కల్పించాలని పలు రాష్ట్రాలు, రంగాల నుంచి అనేక అభ్యర్థనలు వచ్చాయి. దీనిపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ 24 మందికి బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించింది.
Also Read : Chennamaneni Ramesh Babu : రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా చెన్నమనేని రమేశ్ బాబు
ఏపీకి చెందిన బీసీలు నలుగురు, ఎస్సీ, ఎస్టీ ఒకరు ఉండటం గమనార్హం. ఈ నెల 5వ తేదీన టీటీడీ కొత్త చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. 10వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరించారు. 24 మందిలో 18 మంది కొత్త సభ్యులను నియమించగా, ఆరుగురు పాత సభ్యులను పాలక మండలిలో కొనసాగించారు. తెలంగాణ నుంచి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి భార్య గడ్డా సీతారెడ్డితోపాటు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల రాంరెడ్డికి చోటు దక్కింది. తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి నలుగురికి పాలక మండలిలో చోటు కల్పించారు.
Also Read : PM Modi: ఆగస్టు 23 నేషనల్ స్పేస్ డే.. ఇస్రో శాస్ర్తవేత్తలతో ప్రధాని భావోద్వేగం