AP Farmers: ఏపీ రైతులకు శుభవార్త.. అతి త్వరలోనే..!
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త
- యూరియా కొరత నివారించేందుకు ప్రభుత్వం చర్యలు
- రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. రాష్ట్రంలో పంట సాగు ముమ్మరంగా సాగుతున్న వేళ యూరియా కొరత నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంది. కేంద్ర రసాయనాలు అండ్ ఎరువుల శాఖ మంత్రితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. రైతులకు యూరియా అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను విశాఖపట్నంలోని గంగవరం పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ చేసింది. యూరియా విశాఖలోని గంగవరం పోర్ట్ ద్వారా దిగుమతి కానుంది.
Also Read: Danish Malewar: దేశవాళీ క్రికెట్లో నయా సెన్సేషన్.. దులిప్ ట్రోఫీలో మలేవర్ సంచలన ఇన్నింగ్స్!
Also Read
- Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
- Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- Healthy Breakfast Recipe: రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఇదే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్..! ప్రోటీన్ అధికంగా ఉండే శనగ చాట్ ఇలా ట్రై చేయండి..
రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురుచూస్తున్న జిల్లాలకు యుద్ధప్రాతిపదికన యూరియా బస్తాలను పంపాలని మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గంగవరం పోర్ట్‌కు సెప్టెంబర్ 6వ తేదీన యూరియా షిప్ రావాల్సి ఉండగా.. రైతుల అత్యవసర అవసరాల దృష్ట్యా వారం రోజులు ముందుగానే షిప్ వచ్చేలా మంత్రి చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్ మొదటి వారం చివరిలో కాకినాడ పోర్ట్‌కు 30,000 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ యూరియా కూడా రాష్ట్రంలోని రైతుల అవసరాల కోసం వినియోగించబడుతుందని చెప్పారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన సమయంలో యూరియా అందించే బాధ్యత తమది అని మంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
-
Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2026 Playoffs Scenario: కేకేఆర్ సెన్సేషనల్ విక్టరీ.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..