Pawan Kalyan: అందరి ఆశీస్సులతో మార్క్ శంకర్ కోలుకొంటున్నాడు.. లేఖ విడుదల
- అందరి ఆశీస్సులతో మార్క్ శంకర్ కోలుకొంటున్నాడు..
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి వాకబు చేశారు.
- ఏపీ డిప్యూటీ సీఎం లేఖ విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా తన కొడుకు సంబంధిత విషయంపై లేఖను విడుదల చేసారు. ఇందులో ఆయన అందరి ఆశీస్సులతో మార్క్ శంకర్ కోలుకొంటున్నాడని చెప్పుకొచ్చారు. ఇక పవన్ కాలేయం విడుదల చేసిన లేఖలో.. మా చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మార్క్ శంకర్ క్రమంగా కోలుకొంటున్నాడు. ప్రమాద విషయం తెలుసుకొని గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఫోన్ చేసి మార్క్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసి దైర్యం చెప్పారని తెలిపారు.
సింగపూర్ లో అవసరమైన సహకారం అందించవలసిందిగా అక్కడి హై కమిషనర్ కు దిశానిర్దేశం చేశారని, వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తెలిపారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడారని, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారని.. వారికి నా ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ఫోన్ చేసి మాట్డారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి కె.పళనిస్వామి, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి శ్రీ రఘు రామకృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు శ్రీ నారా లోకేశ్, కె. ఆచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, దుర్గేష్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సహచర సినీ నటులు, సినిమా రంగ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా మార్క్ శంకర్ కోలుకోవాలని ఆకాంక్షించారని తెలిపారు.
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
అలాగే నాయకులు, కార్యకర్తలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉండాలని కోరినట్లు తెలిపారు. ఇంతమంది మంచి మనసుతో ఆకాంక్షించి, ఆశీస్సులు అందించడంతో మార్క్ శంకర్ క్రమంగా కోలుకొంటున్నాడని, ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!