Bheemili Domestic Violence: విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలోని నేరెళ్లవలసలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అర్ధరాత్రి నిద్రిస్తున్న భర్తపై భార్య వేడివేడి నీళ్లు పోసింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. సలసల కాగే నీటికి అతడి ముఖం, ఛాతి భాగం కాలిపోయింది. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై అందరూ షాక్‌కు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే..
Also Read: Vangalapudi Anitha: వైఎస్ జగన్ మానసిక పరిస్థితిపై చర్చ జరగాలి.. హోంమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
నందిక కృష్ణ, గౌతమిలు ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. నేరెళ్లవలసలో ఈ దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకు భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. కృష్ణ, గౌతమి మధ్య తరచూ తగాదాలు జరుగుతున్నాయి. కృష్ణ వేధింపులు భరించలేని గౌతమి.. బుధవారం రాత్రి 2 గంటల సమయంలో భర్త కృష్ణపై వేడి నీళ్లు పోసింది. వేంటనే అతడు కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా.. కృష్ణ మొహం మొత్తం కాలిపోయింది. వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.