Bheemili Domestic Violence: విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలోని నేరెళ్లవలసలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అర్ధరాత్రి నిద్రిస్తున్న భర్తపై భార్య వేడివేడి నీళ్లు పోసింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. సలసల కాగే నీటికి అతడి ముఖం, ఛాతి భాగం కాలిపోయింది. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై అందరూ షాక్‌కు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. Also Read: Vangalapudi Anitha: వైఎస్ జగన్ మానసిక పరిస్థితిపై…
ఎన్నికల సమరానికి వైసీపీ సిద్ధమైంది. ఈనెల 27నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా భీమిలిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. భీమిలిలో తొలి క్యాడర్ మీటింగ్ చేపట్టనున్నారు. మరోవైపు.. ఎన్నికల శంఖారావం సభ "సిద్ధం" పోస్టర్ ను వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు. దాంతో పాటు "సిద్ధం"థీమ్ సాంగ్ కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. విశాఖలో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. పిడికిలి బిగించిన సీఎం జగన్…
టీడీపీ ఆవిర్భవించినప్పుడు యూత్ లుక్ ఎక్కువ. తర్వాత యువతను ప్రోత్సహించిన సందర్భాలు అరుదే. తెలుగుదేశం ఆవిర్భవించిన 40 ఏళ్ల తర్వాత… రాబోయే ఎన్నికల్లో 40 శాతం మంది యువతకే ప్రాధాన్యం అన్నది ప్రస్తుతం చంద్రబాబు మాట. 2019 ఎన్నికల తర్వాత పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. దీనికితోడు ఇంఛార్జుల పేరుతోనో.. సీనియర్లు అనే హోదాలోనో చాలా మంది లీడర్లు ఎక్కడికక్కడ పాతుకుపోయారు. వారు పనిచేయరు.. మిగిలిన వారికి అవకాశం ఇవ్వరు అనే విమర్శలు పసుపు శిబిరంలోనే ఉన్నాయి. వచ్చే…