BREAKING NEWS : ప్రొద్దుటూరులో ఉద్రిక్తత.. నారా లోకేష్ పై కోడి గుడ్ల దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది..తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో లోకశ్ పై కోడిగుడ్డుతో దాడిచేశారు.. అయితే ఆ గుడ్డు లోకేష్ కు తగలకుండా పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి తగిలాయి. దీంతో సెక్యూరిటీ అప్రమత్తం అయింది. ప్రొద్దుటూరు శివాలయం సెంటర్‌లో బహిరంగ సభ ముగించుకుని ఆర్టీసి బస్టాండ్ దాటి న తరువాత ఓ దుకాణం వద్ద ఆగి ప్రజలతో మాట్లాడుతుండగా గుడ్ల దాడి జరిగింది..
అయితే సెక్యూరిటీకి తగలడంతో వారు వెంటనే అప్రమత్తం అయ్యారు..ప్రొద్దుటూరులో లోకేష్ యువగళం సందర్భంగా పోలీసు సెక్యూరిటీ ఉన్నప్పటికీ దాడి జరగడంపై టిడిపి వర్గాలు పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పోలీసులు న్యాయం వైపు కాకుండా వైసీపీకి కొమ్ముకాస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు.. ఈ సందర్భంగా పోలీసుల సెక్యూరిటీపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
లోకేశ్‌పై కోడిగుడ్డు వేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అప్రమత్తం కావడంతో రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి యువగళం పాద యాత్ర కొనసాగింది..ఆ సమయంలోనే ఇద్దరు యువకులు లోకేష్‌పై కోడిగుడ్లు, రాయి విసరడంతో టీడీపీ నేతలు అంతా షాకయ్యారు. యువకుల చర్యతో టీడీపీ కార్యకర్తలు కోపంతో ఊగిపోయారు. కోడిగుడ్లు విసిరిన వ్యక్తులను గుర్తించిన టీడీపీ కార్యకర్తలు.. వారిని వెంబడించి పట్టుకుని చితకబాదారు.. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఎటువంటి గొడవలు జరగకుండా వారిని అదుపులోకి తీసుకున్నారు.. పోలీసుల తీరుపై లోకేష్ మండిపడ్డారు..ఇందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
లోకేష్ గారి పాదయాత్రలో రెచ్చిపోయిన సైకోలు. లోకేష్ భద్రతా సిబ్బంది పై కోడిగుడ్డు విసిరిన వైసిపి కార్యకర్తలు. పోలీసుల ఏకపక్ష వ్యవహార శైలి పై లోకేష్ ఆగ్రహం#YuvaGalamPadayatra#PyschoJagan#LokeshinProddatur #PsychoPovaliCycleRavali pic.twitter.com/g0msK1FHed
— Telugu Desam Party (@JaiTDP) June 1, 2023
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!