CM Chandrababu: విశాఖ-విజయనగరం కలిసిపోతాయి.. జూన్ 2026కి భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తి..
- భోగాపురం విమానాశ్రయ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు..
- ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం భోగాపురం ఎయిర్‌పోర్ట్..
- విశాఖ - విజయనగం కలిసిపోతుంది..
- 45 మిలియన్ ప్రయాణికులు ట్రావెల్ చేస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్టుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఒకటి.. అయితే, జూన్ 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు పూర్తికానున్నట్టు వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. భోగాపురం చేరుకున్న సీఏం చంద్రబాబుకు మంత్రులు అధికారులు.. పార్టీ ముఖ్య నాయకులు, అధికారులు స్వాగతం పలికారు.. ఆ తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయ పనులను పరిశీలించారు చంద్రబాబు.. అనంతరం రాష్ట్రంలో ఎయిర్ పోర్ట్ పై సెంట్రల్ ఏవియేషన్ అధికారులతో సమీక్ష చేశారు.. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ ఉంటుండగానే కాకినాడ, అమలాపురంలో ఎయిర్ పోర్ట్ లకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.. ఇక, భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తి కావటానికి ఎంత సమయం పడుతుందని జీఎంఆర్ ప్రతినిధులను అడిగారు చంద్రబాబు.. దానికి సమాధానంగా 2026 జూన్ నాటికి పూర్తి చేయనున్నట్టు తెలిపారు జీఎంఆర్ ప్రతినిధులు.. అలాగే మౌలిక సదుపాయాల వాటర్, పవర్ అందించే విషమై చొరవ చూపాలని సీఎం చంద్రబాబును కోరారు జీఎంఆర్ ప్రతినిధులు..
Read Also: Lung cancer: భారత్ లో వేగంగా విస్తరిస్తున్న ఊపిరితిత్తుల క్యాన్సర్.. కారణం ఇదే…
Also Read
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- India vs Zimbabwe: ఇంగ్లండ్‌లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్‌లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టిస్తాడా?..
ఇక, అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం భోగాపురం ఎయిర్ పోర్ట్.. ఇది గ్రోత్ ఇంజన్ గా పనిచేస్తుందని తెలిపారు.. రానున్న రోజుల్లో విశాఖపట్నం – విజయనగం కలిసిపోతాయన్నారు.. ఫేజ్ వన్ లో బీచ్ రోడ్, ఫేజ్ త్రీలో శ్రీకాకుళం రోడ్.. 5 వేల ఎకరాలు తీసుకోడం జరిగింది.. ఎయిర్ పోర్ట్ పనులు చూస్తే 38 శాతం పూర్తి చేశారని తెలిపారు.. ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి 45 మిలియన్ పాసింజర్ ట్రావెల్ చేస్తారు.. అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, పారిశ్రామికంగా ఎదడగానికి భోగాపురానికి మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే, కొంత హైవేల వద్ద కనెక్టివిటీ సమస్య ఉందని గుర్తించాం.. అలాగే స్టేట్ హైవేలో కూడా సమస్యలు ఉన్నాయి.. వీటిని కూడా పరిష్కరించేలా ముందుకు వెళ్తాం అన్నారు. నా తొలి పర్యాటక ఉత్తరాంధ్ర పెట్టుకున్నా.. అన్నివిధాలా అభివృద్ధి చేసి విశాఖ రుణం తీర్చుకుంటాం అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. నాపై ప్రజలకు.. ప్రజలపై నాకు నమ్మకం ఉంది.. మాకు పవన్ కల్యాణ్, బీజేపీ తోడయ్యారు.. చరిత్రక విజయాన్ని అందించారని గుర్తుచేశారు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో పాటు.. రాష్ట్రంలో ఇంకా ఐదారు ఎయిర్‌పోర్ట్‌లు రాబోతున్నాయన్నారు చంద్రబాబు. కుప్పం, దగదర్తి, నాగార్జున సాగర్‌తో పాటు మూలపేటను కూడా పరిశీలిస్తున్నాం.. అవికాకుండా ఇతర ప్రాంతాలను కూడా పరిశీలిస్తామని వెల్లడించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
-
India vs Zimbabwe: ఇంగ్లండ్‌లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్‌లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టిస్తాడా?..
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!