Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- లడఖ్ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసిన విదేశాంగ శాఖ
- లడఖ్‌లోని 28 వ్యూహాత్మక ప్రాంతాలకు భారత్ అధికారిక పేర్లు
- భారత్ చర్యను చట్టవిరుద్ధమంటూ అభ్యంతరం తెలిపిన చైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ladakh: లడఖ్ భారత్ అంతర్భాగమని, చైనా ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఈ వాస్తవాన్ని మార్చలేరని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం లడఖ్‌లోని 28 వ్యూహాత్మక ప్రాంతాలకు, భౌగోళిక ప్రదేశాలకు అధికారికంగా పేర్లు నిర్ధారించి భారత మ్యాప్‌లో చేర్చడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో భారత్ ఈ ప్రకటన చేసింది.
అక్టోబర్ 02న భారత ప్రభుత్వం లడఖ్‌లోని పలు ప్రాంతాలను అధికారికంగా గుర్తించింది. వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి ఉన్న గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ వంటి సున్నితమైన సరిహద్దు ప్రాంతాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. 2020లో భారత్, చైనాల మధ్య నెలకొన్న గాల్వాన్ ఘర్షణ సమయంలో గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ కీలక ఘర్షణ ప్రాంతాలుగా నిలిచాయి. భారత్ గుర్తించిన ఇతర ప్రాంతాల్లో అలీషా గిరి, బ్రాంగ్సా, చాప్చింగల్ పాస్, కనిష్క పీక్, కరుణ్ పీర్ పర్వతం, కుక్సెల్, మార్తండ్ గిరి, పార్పిక్ హిమానీనదం, స్కామ్రి హిమానీనదం, షాచ్మిరిక్ పాస్, ష్కోర్గా లోయ, జొరావర్ పీక్ తదితర ప్రాంతాలు ఉన్నాయి.
Also Read
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
అయితే, భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ తప్పపట్టారు. భారత్ ఏకపక్ష్ంగా ఈ నిర్ణయాన్ని తీసుకుందని, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా తాము గుర్తించబోమని అన్నారు. భారత్ పేర్లు పెట్టడం చట్టవిరుద్ధమని, చైనా-భారత్ సరిహద్దు పశ్చిమ ప్రాంతంలోని సంబంధిత భూభాగాలు చైనాకే చెందుతాయని ఆమె వాదించారు. తాజా ప్రకటనలో భారత్ చైనా వ్యాఖ్యలకు చెక్ పెట్టింది.
తాజావార్తలు
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!