CM Chandrababu: వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పోలవరం జలాలు పారాలి!
- కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
- ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యత నాది
- గండికోటను పర్యాటక హబ్‌గా తయారు చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బనకచర్లకు జలాలు తీసుకురావడం తన జీవితాశయం అని, వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పోలవరం జలాలు పారాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం సహకారంతో రూ.12,200 కోట్లతో డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించాం అని, రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. పోలవరం నుంచి బనకచర్ల వరకు అనుసంధానం చేస్తే ఒక గేమ్ ఛేంజర్‌గా తయారవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యత తనదని, పోలవరం నుంచి కృష్ణ నీళ్లు మళ్లిస్తాం అని సీఎం చెప్పారు. ఈరోజు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘ ప్రాజక్టులలో ఉన్న నీటిని సమర్థవంతంగా వాడుకుందాం. కడప జిల్లాను హార్టికల్ హబ్ గా మారుస్తాం. నేను సీఎంగా ఉన్నపుడు 90 శాతం మైక్రో ఇరిగేషన్‌కు పెద్దపీట వేశా.కడపలో ముఠాలను అణిచివేసిన పార్టీ టీడీపీ. పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి. ఈ ఏడాది 4వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్లాయి. పోలవరం నుంచి 200-300 టీఎంసీల నీళ్లు రాయలసీమకు మళ్ళిస్తున్నాం. అందుకే పోలవరంను పట్టాలెక్కించాం. కేంద్ర సహకారంతో రూ.12,200 కోట్లతో డయాఫ్రం పనులు ప్రారంభించారు. రెండు సంవత్సరాలలో పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం నుంచి బనకచర్ల వరకు అనుసంధానం చేస్తే ఒక గేమ్ ఛేంజర్‌గా తయారవుతుంది. బనకచర్లకు నీళ్లు తీసుకురావడం నా జీవిత ఆశయం. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పోలవరం జలాలు పారాలి’ అని అన్నారు.
Also Read
- Syria: సిరియా పర్యటనలో మాక్రాన్‌కు తప్పిన ప్రమాదం.. హోటల్ సమీపంలో భారీ పేలుళ్లు
- రూ.2.55 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. Piaggio Ape WavE ఫీచర్లు అదుర్స్!
- Minister Parthasarathy: జగన్‌పై మంత్రి పార్థసారథి ఫైర్.. విద్వేష రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు..!
- Minister Kolusu Parthasarathy: ఏపీలో పేదలకు శుభవార్త.. 9 లక్షలకు పైగా ఇళ్ల దరఖాస్తులకు అర్హత
Also Read: NTR Death Anniversary: ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు.. తెలుగువారి ఆత్మగౌరవం: సీఎం చంద్రబాబు
‘ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యత నాది. పోలవరం నుంచి కృష్ణ నీళ్లు మళ్లిస్తాం. నల్లమల ఫారెస్టులో ఒక టన్నెల్ నిర్మిస్తే రాయలసీమకు నీళ్లు వస్తాయి. నేను కూడా పుట్టింది రాయలసీమలోనే, సీమ ప్రజల రుణం తీర్చుకుంటా. కరువు రైతు రాష్ట్రంగా మారాలంటే.. నదులు అనుసంధానమే మార్గం. ఒకప్పుడు అసాధ్యం.. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి చేసి చూపిస్తా. కోప్పర్తిని ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారు చేస్తా. నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తా. స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై దృష్టి సారిస్తున్నాం. ఈనెల చివరలో వాట్సప్ గవర్ననెన్స్ తీసుకొస్తున్నాం. ఈరోజు ఓపెన్ చేయాల్సి ఉంది కానీ.. కొన్ని అనివార్య కారణాలవల్ల చేయలేకపోయాం. ఫోన్ ద్వారానే అన్ని సేవలు మీకు అందుబాటులోకి తేవడం కోసం కృషి చేస్తున్నాం. కడప ఎయిర్ పోర్టులో రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేబడతాం. ప్రపంచ వింతల్లో గండికోట చాలా అద్భుతమైనది. గండికోటను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. ఓ పర్యాటక హబ్‌గా తయారు చేస్తాం’ అని సీఎం చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Extra Marital Affair : మియాపూర్ లో దారుణం.. భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.!
-
Syria: సిరియా పర్యటనలో మాక్రాన్‌కు తప్పిన ప్రమాదం.. హోటల్ సమీపంలో భారీ పేలుళ్లు
-
Kriti Sanon: అమ్మతనం కోసం కృతి సనన్ సంచలన నిర్ణయం.. ఆ సినిమా టైమ్‌లోనే అలా!
-
Antarctica: రక్త జలపాత రహస్యం.. 100ఏళ్ల మిస్టరీ వీడింది!
-
IND vs ENG 3rd T20: ‘సర్పంచ్ సాబ్’ సత్తాకు పరీక్ష.. ఆ స్టార్స్ రాణించకుంటే అంతే సంగతులు!
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!