Banakacherla Project: ఈ మధ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య బనకచర్ల ప్రాజెక్టు తీవ్ర వివాదంగా మారింది.. ఎలాగైనా బనకచర్లను అడ్డుకుంటామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించగా.. మిగులు జలాలనేకదా? మేం వాడుకునేది.. అభ్యంతరాలు ఎందుకంటూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశ్నించింది.. అయితే, దీనిపై కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదులు కూడా చేశారు తెలంగాణ సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిక కేంద్ర సర్కార్ షాక్ ఇచ్చింది.. బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపింది కేంద్రం.. పర్యావరణ…
ఏపీ కేబినెట్ సమావేశంలో బనకచర్లపై కీలక చర్చ సాగింది.. పోలవరం బనకచర్ల పై తెలంగాణ వాళ్లు అందరూ మాట్లాడుతున్నారు.. నిన్న తెలంగాణ కేబినెట్‌లో వాళ్లు డిస్కస్ చేశారు.. మనం కూడా మన వాదన వినిపించాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. వాళ్లు అనుమతి లేని ప్రాజెక్టులను కూడా కడుతున్నారు.. ఇంకా, అనేక ప్రాజెక్టులు కడుతున్నారు.. వాళ్లు వాడుకోగా మిగిలిన నీళ్లు కదా మనం వాడుకొనేది అన్నారు సీఎం చంద్రబాబు..
బనకచర్లకు జలాలు తీసుకురావడం తన జీవితాశయం అని, వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పోలవరం జలాలు పారాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం సహకారంతో రూ.12,200 కోట్లతో డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించాం అని, రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. పోలవరం నుంచి బనకచర్ల వరకు అనుసంధానం చేస్తే ఒక గేమ్ ఛేంజర్‌గా తయారవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యత తనదని, పోలవరం నుంచి కృష్ణ నీళ్లు మళ్లిస్తాం…