Minister Kolusu Parthasarathy: ఏపీలో పేదలకు శుభవార్త.. 9 లక్షలకు పైగా ఇళ్ల దరఖాస్తులకు అర్హత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kolusu Parthasarathy: ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు గృహ వసతి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు మంత్రి కొలుసు పార్థసారథి.. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేస్తోంది. మంత్రి పార్థసారథి వెల్లడించిన వివరాల ప్రకారం, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 8 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అధిక నిధులు కేటాయించి ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసినట్లు తెలిపారు..
2019-24 మధ్య 6 లక్షల ఇళ్ల నిర్మాణం
2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో సుమారు 6 లక్షల ఇళ్ల నిర్మాణం మాత్రమే జరిగినట్లు పేర్కొన్నారు పార్థసారథి.. దీంతో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. అయితే, పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగా, 10 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. వీటిలో పరిశీలన అనంతరం 9 లక్షలకు పైగా దరఖాస్తులు అర్హత సాధించినట్లు వెల్లడించారు.
Also Read
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
- Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
కేంద్రం నుంచి మరిన్ని ఇళ్ల మంజూరుపై దృష్టి
అర్హులైన ప్రతి కుటుంబానికి గృహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగిస్తున్నట్లు తెలిపారు మంత్రి పార్థసారథి… త్వరలో కేంద్రం నుంచి మరిన్ని ఇళ్ల మంజూరు పొందేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని వెల్లడించారు.. రాష్ట్రంలోని పేదలకు సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గృహ నిర్మాణ కార్యక్రమాన్ని విస్తరిస్తోంది. కేంద్ర సహకారంతో మరిన్ని ఇళ్లు మంజూరు చేయించి అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి..
తాజావార్తలు
-
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
-
New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?