Mokshagna : నందమూరి నట సింహం మోక్షజ్ఞ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా డెబ్యూ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. హనుమాన్ వంటి సువర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఆయన మొదటి సినిమా రాబోతుంది. ఈ సినిమాను SLV, LEGEND ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Also:Ration Mafia : ఏపీలో రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన సిట్
ఇదిలా ఉండగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ డిసెంబరు 5 అనగా ఈ రోజు నిర్వహిస్తున్నారని గత కొద్దీ రోజలుగా వార్తలు వచ్చాయి. ఈ కార్యక్రమానికి బాలయ్య కుటుంబీకులు, అలాగే ఏపీకి చెందిన ఓ యువ నేత , అలాగే ఏపీ విద్యా శాఖమంత్రి నారా లోకేష్ తదితరులు హాజరవుతారని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమా పూజా కార్యక్రమం వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ఆగిపోయిందంటూ పలు రూమర్స్ మొదలయ్యాయి. దీనితో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఆగిపోయినట్లేనా అని నందమూరి అభిమానులు కూడా కొంత బాధ పడ్డారు. అయితే ఇపుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అసలు క్లారిటీ వినిపిస్తుంది. వీరి కలయికలో సినిమా ఆగిపోలేదట.
Read Also:Champions Trophy 2025: బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందే.. ప్లేయర్స్ సేఫ్టీ చాలా ముఖ్యం
జస్ట్ ముహూర్తం వాయిదా పడినట్టుగా మాకు సమాచారం. సో ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఇంకా ఆన్ లోనే ఉందని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ ఆల్రెడీ మోక్షజ్ఞని సాలిడ్ లెవెల్లో రెడీ చేస్తున్నాడు. సో ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు. మోక్షును వెండితెరపై చూసేందుకు నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. నందమూరి నటసింహం బాలయ్య హీరోగా ఇపుడు డాకు మహారాజ్ అనే సాలిడ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా బాలయ్య తన ఓటిటి షోలో కూడా బిజీగా ఉన్నారు.