AP Cabinet 2026: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపులకు ఆమోదం!
- నేడు ఏపీ కేబినెట్ సమావేశం
- కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు
- అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపు ప్రతిపాదనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపు, నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కేబినెట్ ముందుకు రానున్నాయి.
ఈ సమావేశంలో సీఆర్డీఏ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే సీబీఎస్ఈ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణం కోసం 80 సెంట్ల భూమిని కేటాయించే ప్రతిపాదనపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి మూడు ఎకరాల భూమిని కేటాయించే అంశం కూడా క్యాబినెట్ పరిశీలనకు రానుంది. ఇక పంచాయతీరాజ్ విభాగానికి చెందిన ఏపీఎస్ఐఆర్డీకి ఐదు ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం.
Also Read
- 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
- Gaddam Prasad: "చర్యలు తీసుకుంటాం".. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
Also Read: Annadata Sukhibhava 2026: రైతులకు ఉగాది కానుక.. నేడే ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులు!
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం రూ.2,316 కోట్ల వ్యయానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసే ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రానుంది. అలాగే రూ.119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపే అవకాశముంది. కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావం, గ్యాస్ నిల్వలు సహా ఇతర ముఖ్య అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!