Joe Biden: పుతిన్‌పై బైడెన్ దూషణల పర్వం.. బూతు మాటతో స్పీచ్ స్టార్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా (America) అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై వ్యక్తిగత దూషణల పర్వానికి దిగారు. గతంలో అనేక మార్లు పుతిన్‌పై నోరు పారేసుకున్నారు. తాజాగా మళ్లీ వ్యక్తిగత దూషణలకు దిగారు. మిస్టర్ పుతిన్ అని సంభోదించడానికి ఒక బూతు పదాన్ని బైడెన్ ఉపయోగించారు.
పుతిన్ వల్ల అణుయుద్ధం వచ్చే అవకాశం ఉందని.. దీంతో మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందని బైడెన్ వ్యాఖ్యానించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
పుతిన్ లాంటి వెర్రి వ్యక్తులు అధ్యక్షులుగా ఉన్నంతకాలం అణుయద్ధం గురించి ఆందోళన చెందాల్సిందేనని బైడెన్ వాపోయారు. అలాంటి వ్యక్తులతో మానవాళి మనుగడకు ప్రమాదకరమేనని చెప్పుకొచ్చారు. ఇక శుక్రవారం నుంచి రష్యాపై కొత్త ఆంక్షలు విధిస్తామని బైడెన్ చెప్పుకొచ్చారు.
ఇక పనిలో పనిగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై కూడా విమర్శలు గుప్పించారు. రష్యా ప్రతిపక్ష నాయకుడు నావల్నీ మృతికి.. తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలకు ముడిపెడుతూ ట్రంప్ మాట్లాడటాన్ని బైడెన్ తప్పుబట్టారు.
పుతిన్‌పై బైడెన్ విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన నాటినుంచి పుతిన్ విధానాలపై బైడెన్ తీవ్ర విమర్శలు చేస్తునే ఉన్నారు. పలు సందర్భాల్లో ఆయనను కసాయి, యుద్ధ నేరస్థుడిగా వ్యాఖ్యానించారు. ఇటీవల అనుమానాస్పద రీతిలో జైల్లో మృతి చెందిన రష్యా ప్రతిపక్ష నాయకుడు నావల్నీ మృతికి పుతినే కారణమని బైడెన్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!