బుల్లితెర పై గతంలో సక్సెస్ ఫుల్ గా టెలికాస్ట్ అయిన సీరియల్ కార్తీకదీపం సీరియల్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. టీవీ టీఆర్పీ రేటింగ్స్ లో సరికొత్త రికార్డులు సెట్ చేసింది. ఈ సీరియల్ సీక్వెల్ వస్తే బాగుండు అని అందరు అనుకున్నారు.. అందరి కోరిక మేరకు ఈ సీరియల్ సీజన్ 2 రాబోతుంది.. కార్తీకదీపం నవ వసంతం పేరిట ఈ సీరియల్ సీజన్ 2 నేటి నుంచి టెలికాస్ట్ కానుంది. స్టార్ మా ఛానల్ లో సోమవారం నుంచి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ సీరియల్ ప్రసారం కానుందని తెలిసిందే..
ఏ సీరియల్ కు లేని విధంగా సినిమా లెవల్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేసి మరి ప్రోమోను విడుదల చేశారు.. ఆ ప్రోమో ఎంతగా ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం.. ఈ సీజన్ లో మెయిన్ లీడ్స్ డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలను నిరుపమ్ పరిటాల, ప్రేమ్ విశ్వనాధ్ లే చేస్తున్నారు.. ఇక మిగిలిన అన్ని పాత్రలను మార్చేశారు.. వేరే వాళ్లను పెట్టినట్లు ప్రోమోను చూస్తుంటే తెలుస్తుంది.. గత సీజన్ లో డాక్టర్ బాబు, వంటలక్క తో పాటుగా విలన్ గా నటించిన మోనిత పాత్ర అందరిని ఆకట్టుకుంది.. ఆ పాత్రలో గత సీజన్ లో శోభాశెట్టి నటించింది..
ఈ సీజన్ లో ఆ పాత్రను కూడా మార్చేసినట్లు తెలుస్తుంది.. ఫిమేల్ సెకండ్ లీడ్ గా నటి, యాంకర్ గాయత్రీ సింహాద్రి నటిస్తోంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన ప్రోమోలలో గాయత్రీ సింహాద్రి కనిపిస్తుంది.. ఈ అమ్మడు గతంలో కొన్ని సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇప్పుడు ఏకంగా కార్తీకదీపం సీజన్ 2లో ముఖ్య పాత్ర ఛాన్స్ కొట్టేసింది.. మరి ఆ పాత్రలో జనాలను ఎలా అలరిస్తుందో చుడాలి..